Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

పెండింగ్ బిల్లుల పైనే ఫోకస్.. బాబు ప్లానింగ్ ఇదే..!

గత ప్రభుత్వం 5 ఏళ్ళుగా వదిలేసిన బకాయిలపై చంద్రబాబు నాయుడు సర్కార్ దృష్టి పెట్టింది. ఈ ఏడాది భారీగా చెల్లింపులు చేసేందుకు సిద్దమైంది. 2025 ఏడాది బిగినింగ్ నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపుల పైనే ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న.. పెండింగ్ బిల్లుల చెల్లింపుల పైనే దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్. పెండింగ్ బిల్లులపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకు డీటైల్ట్ నోట్ ఇచ్చారు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్. వివిధ వర్గాలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను ప్రణాళికా బద్దంగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది.

Also Read: బొత్తిగా భయం లేకుండా పోయింది..!

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ చెల్లింపుల ప్రక్రియ చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బకాయిల చెల్లింపులతో ఆరున్నర లక్షల మంది విద్యార్థుల చేతుల్లోకి సర్టిఫికెట్లు వచ్చేసాయి. ఐదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన పోలవరం నిర్వాసితులకు పరిహరం చెల్లింపులు చేసింది కూటమి సర్కార్. అమరావతి రైతులకు కౌలు చెల్లింపులూ క్లియర్ చేసింది. గత ప్రభుత్వ విధానాలతో ఇబ్బంది పడ్డ వివిధ ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్ నిధులను విడుదల చేసారు.

Also Read: ఎమ్మెల్యేలు జారిపోతారా..? కాచుకు కూర్చున్న బిజెపి…!

పెండింగ్ బిల్లుల క్లియరన్సుతో ఒకేసారి 26 వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఒడ్డున పడనున్నారు. 2025 జనవరి నెలలోనే ఇప్పటి వరకు సుమారు రూ. 8 వేల కోట్ల చెల్లింపులు చేసారు. పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్లు చేల్లిచారు. ఉద్యోగులకు చెల్లింపుల కింద రూ. 1300 కోట్లు ఇచ్చారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బిల్లుల కోసం రూ. 788 కోట్లు విడుదల చేసారు. వివిధ వర్గాలకూ మరిన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే దాదాపుగా పెండింగ్ బిల్ల్స్ మొత్తం క్లియర్ చేసినట్లు అధికార వర్గాలు తెలియచేస్తున్నాయి. అమరావతి రైతులకి కూడా కౌలు రొక్కం వారి వారి అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు నిన్న హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్