నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. సినిమా పాజిటివ్ టాక్ తో అన్ని సెంటర్స్ లో రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఇక ఆన్లైన్ బుకింగ్ యాప్స్ లో కూడా ఈ సినిమా హవా కంటిన్యూ అవుతుంది. యువ హీరోలతో పోటీ పడుతూ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతికి విన్నర్ గా నిలిచింది. వేరే సినిమాలు ఉన్నా సరే ఈ సినిమా డామినేషన్ దెబ్బకు దాదాపుగా సైడ్ అయిపోయాయి అని చెప్పుకోవాలి. ప్రముఖ బుకింగ్ యాప్ బుక్ మై షో లో ఈ సినిమా ట్రెండ్ అవుతుంది.
Also Read: స్పీకర్లకు నిప్పుపెట్టేస్తున్న తమన్.. దండం రా దూత…!
ఇప్పటివరకు 6 లక్షల 66 వేల టికెట్లు బుక్ మై షో లో బుక్ అయ్యాయి. డైరెక్ట్ బుకింగ్స్ కూడా ఈ సినిమాకు భారీగానే ఉన్నాయి. అటు పేటీఎంలో కూడా 2 లక్షలకు పైగా టికెట్లను విక్రయించింది ఈ సినిమా. కేవలం ప్రముఖ, ఒక మాదిరి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ యాప్స్. ఇక ఇతర యాప్స్ లో కూడా ఈ సినిమా హవా నడుస్తోంది. మొదటి రోజు 56 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా భారీగానే వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఈ సినిమా ఖచ్చితంగా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలవబోతుంది అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. సినిమాలో కథ బలంగా ఉండటం.. బాలకృష్ణని ఎలివేషన్ చేసిన విధానం.. అలాగే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా ప్లస్ అయ్యాయి.
Also Read: సంక్రాంతి విన్నర్ బాలయ్యే..!
ఈ సినిమాను తక్కువ అంచనా వేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వసూళ్లు కూడా భారీగా పడిపోయాయి అంటున్నారు సినీ పండితులు. అయితే ఉత్తరాదిలో గేమ్ చేంజర్ సినిమా ఊహించని విధంగా వాసూల్లు పెంచుకోవడం సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈరోజు విడుదల అయిన వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సైతం మంచి టాక్ సంపాదించుకుంది. మొత్తం మీద సంక్రాంతి విన్నర్ ఎవరనేది మరి కొన్ని రోజులు అయితే గానీ చెప్పలేము.