ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో రాష్ట్రానికి.. భారీ వరాలు ప్రకటించనున్నారు. ప్రకటించడమే కాదు శంకుస్థాపనలు చేసి రాష్ట్ర అభివృద్ధిపై తమకు ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉందో నిరూపించుకోమన్నారు. దాదాపు 2.8 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో శ్రీకారం చుట్టునున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Also Read : ఉత్తరాంధ్ర నేతలు ఏమయ్యారు..?
ఉత్తరాంధ్రను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే దిశగా అనకాపల్లి జిల్లాలో ఎన్టిపిసి గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులతో పాటుగా జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చెన్నై బెంగళూరు పారిశ్రామిక.. కారిడార్ లో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు మోడీ. అచ్చుతాపురం మండలం పూడిమడకలో 1200 ఎకరాలలో ఎన్టిపిసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయనున్నారు.
Also Read : రేవంత్ పేరు కావాలనే మర్చిపోతున్నారా…?
దాదాపు లక్ష 85 వేల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీని ద్వారా 25 వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే 2000 ఎకరాల్లో నిర్మించే బల్క్ డ్రగ్ పార్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. దీని వ్యయం 1876 కోట్లు కాగా పది నుంచి 14 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 900 కోట్ల పనులకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. దీని ద్వారా 28,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది. ఇక చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా తిరుపతి జిల్లా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నగరానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.
Also Read : వంశీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్
దీన్ని 2027 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికోసం ఇప్పటికే చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణ కూడా పూర్తయింది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆటో, ఫార్మసిటికల్స్ తదితర పరిశ్రమలు కూడా రానున్నాయి. తొలి దశలోనే సుమారు 37,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 4.67 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా రోడ్ల నిర్మాణాలకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు.