Tuesday, October 28, 2025 02:13 AM
Tuesday, October 28, 2025 02:13 AM
roots

సురేష్ కు సుప్రీం షాక్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమే..?

మాజీ ఎంపీ నందిగం సురేష్ కు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2020 లో తుళ్లూరు మండలం వెలగపూడి కి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ పై సురేష్ అనుచరులు దాడి చేశారు. తనకి వస్తున్న పెన్షన్ ను అప్పటి సిఎం వైఎస్ జగన్ నిలిపివేశారని… ఇల్లు ఇస్తామని ఇవ్వలేదని జగన్ పై ఆమె విమర్శలు చేశారు.

Also Read : ఏపి కేబినేట్ లో భారీ మార్పులు ఖాయం..?

దీన్ని సీరియస్ గా తీసుకున్న నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటి పై దాడి చేసి ఆమెను హతమార్చారు. అయితే అప్పుడు సురేష్ పై కేసు నమోదు అయినా… సరే దీనిపై ముందుకు వెళ్లలేదు. ఇక పోలీసులు కూడా ఈ వ్యవహారంలో పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపించాయి. 2020 నుంచి పోలీసుల విచారణ జరగకపోవడంతో దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ను మరియమ్మ కుమారుడు కలిసి తన తల్లికి న్యాయం చేయాలంటూ కోరాడు.

దీనితో ఈ కేసులో పోలీసులు నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక కేసు తీవ్రత నేపథ్యంలో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో నందిగం సురేష్ సవాల్ చేశాడు. నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై తాజాగా విచారణ జరగగా.. జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read : ఎన్టీఆర్ – నీల్ స్టార్ట్ అవుతుంది.. మొదటి షెడ్యూల్ అక్కడే..!

సురేష్ తన పాత కేసు వివరాలను ఎందుకు దాచి పెట్టారు అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్ట్ ఆయనకు బెయిల్ మంజూరు చేయకపోవడంతో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో చార్జి షీట్ కూడా దాఖలు కూడా అయిందని… బెయిల్ కోసం ట్రయల్ కోర్ట్ ను ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటీషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. దీనితో ఇప్పట్లో నందిగం సురేష్ బయటకు వచ్చే సంకేతాలు కనబడటం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్