ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిపివేయాలన్న ఈస్ట్ ఆఫ్రికా షిప్ కి విముక్తి లభించింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుందనే ఆరోపణపై కాకినాడ పోర్ట్ లో నవంబర్ 28న నిలిచిపోయిన స్టెల్లా ఎల్ పనామా షిప్.. విషయంలో సందిగ్దత నెలకొంది. అప్పట్లో సంచలనం సృష్టించిన పవన్ ‘సీజ్ ది షిప్’ డైలాగ్ తో ఈ షిప్ నేషనల్ వైడ్ గా ఫేమస్ అయింది. షిప్ నుంచి 1320 టన్నుల బియ్యాన్ని కాకినాడ గౌడౌన్స్ కి తరలించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి శ్రీ సత్యం బాలాజీ ఎక్స్ పోర్టర్స్ పై కేసు నమోదు చేసారు. బియ్యం షిప్ నుంచి తీసేయడంతో షిప్ కి ఆటంకాలు తొలగాయి.
Also Read :వైసీపీ లో శ్యామల డామినేషన్.. మండిపడుతున్న నాయకులు
షిప్ ని సీజ్ చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు కస్టమ్స్ అధికారులు. దీంతో బియ్యాన్ని మాత్రం తరలించి కేసు నమోదు చేసారు పోలీసులు. కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తికావడంతో ఈస్ట్ ఆఫ్రికా కి మిగిలిన ఎగుమతులతో షిప్ బయల్దేరి వెళ్ళింది. కాకినాడ నుంచి ఈ రోజు ఉదయం షిప్ బయల్దేరింది. నవంబర్ 11 నుంచి కాకినాడలోనే షిప్ ఉండిపోయింది. 55 రోజులుగా స్టెల్లా అక్కడే ఉండిపోయింది. బెనిన్ దేశంలోని కీటోనౌ పోర్టుకు షిప్ బయల్దేరి వెళ్ళింది అని అధికారులు తెలియచేసారు.
Also Read :చంద్రబాబు వ్యాఖ్యలపై కేడర్ అసంతృప్తి..!
52 వేలు కి గాను 32415 మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్ అయ్యాక నవంబర్ 27న , డిసెంబర్ 4 న షిప్ లో తనిఖీలు నిర్వహించారు. 36 శాతం పోర్టిఫైడ్ కర్నల్స్ ఉన్నట్లు తేలడంతో షిప్ ఆపేసారు. సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఓనర్ ప్రదీప్ అగర్వాల్, మేనేజర్ కళ్యాణ్ అశోక్ లపై 6ఏ కింద కేసులు నమోదు చేసారు. షిప్ నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజి చార్జి, ఎక్స్పోర్ట్ చార్జీ పోర్టు అథారిటీకి స్టీమర్ ఏజెంట్ చెల్లించారు. నో డ్యూస్ సర్టిఫికెట్ కూడా జారీ చేసారు. కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో తన గమ్యస్థానానికి బయలుదేరింది స్టెల్లా.