Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

సురేష్ కు బిగిసిన ఉచ్చు.. సుప్రీం కోర్ట్ లో సిద్దార్థ్ లూత్రా కీ పాయింట్…

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పట్లో బయటికి వచ్చేలా కనబడటం లేదు. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడానికి ఇష్టపడలేదు. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనితో అక్కడ కూడా సురేష్ కు షాక్ తగిలింది. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలయ్యే వరకు తాము జోక్యం చేసుకోమని ఆ తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Also Read : సీన్ లోకి ఈడీ..? కేటిఆర్ తక్కువ అంచనా వేసారా..?

అయితే వాదనలు వినిపించడానికి పూర్తి సమయం ఇవ్వాలని ఆయన న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను జనవరి 7 కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పలు ఉత్తర్వులు ఇచ్చింది. నందిగం సురేష్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. హత్య కేసుతో పిటిషనర్ కు సంబంధం లేదని ఆయన దళితుల్లోని రెండు వర్గాల మధ్య అల్లర్లను ఉసిగొలిపినట్టు కొందరు చెప్పిన అందులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు ధ్రువీకరించే ఒక సాక్షి కూడా లేరని పిటీషనర్ ను ఇరికించడానికి ఈ కేసు పెట్టారని కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.

అయితే ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆరుసార్లు ఆయన పేరు ప్రస్తావించారు. ఈ మేరకు వాదనలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా… కపిల్ సిబాల్ వాదనలను ఖండించారు. 2020 డిసెంబర్ 27న జరిగిన ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ లో పిటిషనర్ పేరు ఆరుసార్లు ఉందని, అల్లర్లకు వ్యూహకర్త ఆయనే తన అనుచరులకు డబ్బులు మద్యం ఇచ్చి మారణాయుధాలతో దాడికి ఉసిగొల్పారని వాదనలు వినిపించారు. వారి దాడిలోనే మరియమ్మ ప్రాణాలు కోల్పోయారని, ఆ సమయంలో ఆయన అనుచరులు నందిగం సురేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లారని, దాడిలో పాల్గొన్న 36 మందిని రాష్ట్ర పోలీసులు గుర్తించారని సిద్ధార్థ వాదనలు వినిపించారు.

అప్పట్లో ట్రైల్ కోర్టు కొందరు నిదితులకు బెయిల్ మంజూరు చేసే సమయంలో పోలీసులు దర్యాప్తు అయినందున తాము బెయిల్ ను వ్యతిరేకించడం లేదని పేర్కొందని… అయితే దర్యాప్తు నిబంధనలను ప్రకారం నిర్వహించలేదని సిద్ధార్థ వాదించారు. పోలీస్ అధికారి క్షేత్రస్థాయికి వెళ్లకుండా సాక్షుల వాంగ్మూలాలను ర్యాండంగా నమోదు చేసేసారని ఆ సమయంలో… కనీసం ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించలేదని ఈ ఘటన జరిగి మూడేళ్లు అవుతున్న దర్యాప్తు పూర్తిచేసే చారి సీటు వేయడానికి కూడా పోలీసులు ప్రయత్నించలేదని వాదించారు.

Also Read : బాలయ్య విత్ పూరీ… కాంబో రిపీట్…?

సురేష్ పేరు ఎఫ్ఐఆర్ లో ఏ 78 కింద ఉన్నప్పటికీ సిడి ఫైల్ లో నిందితుడిగా చేర్చలేదని సిద్ధార్థ తమ వాదనలు వినిపించారు. వీటన్నిటిని చూస్తే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అధికారులను ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చని… నందిగం సురేష్ పై హత్యా, హత్యాయత్నం వంటి తీవ్ర నేరాలకు సంబంధించి తొమ్మిది కేసులు పెండింగ్లో ఉన్న వాటిని ఆయన బెయిల్ దరఖాస్తులో ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్