అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో అర్ధం కాక పార్టీ అధిష్టానం తల పట్టుకుంటోంది. తాజాగా మరో నేత గుడ్ బై చెప్పారు. వైకాపాకు ఆడారి ఆనంద్ కుమార్ రాజీనామా చేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నంకు చెందిన ఆడారి ఆనంద్ కుమార్ తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి శుక్రవారం పంపించారు అడారి. విశాఖ డైరీ అభివృద్ధి కొరకు పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించేందుకు ఆడారి ఆనంద్ కుమార్ వైకాపాకు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే రీతిలో డైరెక్టర్లుగా కొనసాగుతున్న 9 మంది వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. 1. శరగడం వరాహ వెంకట శంకర్రావు, 2. పిల్లా రమా కుమారి, 3. శీరంరెడ్డి సూర్యనారాయణ, 4. కోళ్ల కాటమయ్య, 5. దాడి పవన్ కుమార్, 6. ఆరంగి రమణబాబు, 7. చిటికెల రాజకుమారి, 8. రెడ్డి రామకృష్ణ, 9. సుందరపు ఈశ్వర్ పరదేశి గంగాధర్ లు రాజీనామా చేసారు.
Also Read : కాకినాడ పోర్ట్ కేసు.. వైసీపీ నేతలకు ఉచ్చు బిగించిన ఈడీ…!
అయితే వీరు రాజీనామా చేయడానికి ప్రధాన కారణం… వ్శాఖ డైరీలో అవినీతి అని సమాచారం. విశాఖలో పాల డైయిరి అక్రమాలపై కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. పాల ధరల విషయంలో యాజమాన్యం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరినామాలతోనే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా వైసీపీకి రాజీనామా చేసి బిజెపిలో జాయిన్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన కలవనున్నారు.