Friday, September 12, 2025 11:23 PM
Friday, September 12, 2025 11:23 PM
roots

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల పంచాయితీ..!

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ సీనియర్ల పంచాయితీ మొదలైందా? తమకు మాట వరుసకైనా చెప్పకుండా అన్ని నిర్ణయాలు తీసుకోవడంపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా? అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి సైలెంట్‌గా ఉన్న లీడర్లు మళ్లీ ఎందుకు ఫైర్ అవుతున్నారు? ప్రతిప‌క్షాల‌పై ఎదురుదాడి చేసిన నేతలు.. సొంత పార్టీ నేతల నిర్ణయాలపై ఎందుకు గుస్సా అవుతున్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏ ఇద్దరు కలిసినా కూడా చర్చించుకునే అంశాలు.

Also Read : మళ్లీ నేనే వస్తా… దువ్వాడ మాస్ వార్నింగ్…!

తెలంగాణ కాంగ్రెస్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడేవాళ్లు. నేతలంతా ఏకతాటిపైకి వస్తే అధికారంలోకి వస్తామని గ్రహించిన రాహుల్ గాంధీ.. తెలంగాణ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించి సమన్వయం పెంచారు. పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్నా బయటకి మాట్లాడొద్దని వార్నింగ్‌ ఇచ్చారు కూడా. అలా మాట్లాడితే.. ఎంతటివారైనా చర్యలు కఠినంగా ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో నేతలంతా సైలెంట్ అయి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హస్తం నేతలెవరూ పార్టీపై గానీ ప్రభుత్వంపై గానీ ఎలాంటి విమర్శలు చేయలేదు.

Also Read: గుడిలో ఈవో పెత్తనం.. ఎమ్మెల్యే ఆగ్రహం..!

అయితే పార్టీలో జరుగుతున్న పరిస్థితులను చూసి కొందరు నేతలు తమ గళం విప్పడం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో నేతల మధ్య ఇబ్బందులు వస్తాయని అందరి మనసులో ఉన్నా.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజ‌య్ కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విష‌యంలో పార్టీ ముఖ్యనేత‌లు జోక్యం చేసుకొని జీవన్ రెడ్డిని శాంతింపచేశారు. తాజాగా కాంగ్రెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జ‌గ్గారెడ్డి చేసిన కామెంట్స్.. పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో కొందరి వ్యవహారం వల్ల.. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం నష్టపోయేలా ఉందన్నారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదని, పార్టీ నష్టపోతుంటే చూస్తూ ఉండలేనని జగారెడ్డి చెబుతున్నారు.

Also Read: అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగలిగారు.. మరి ఆర్జీవీని..? లోపం ఎక్కడుంది?

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో చర్చ జరగాలని, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. కానీ కాంగ్రెస్‌లో ఇద్దరు, ముగ్గురు నేతలు తీసుకున్న నిర్ణయాన్నే ఫైనల్ చేయడం పట్ల జగ్గారెడ్డి అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లో కలిసిన పార్టీ సహా ఇన్‌ఛార్జ్‌ విష్ణునాధ్‌తో చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఇన్‌ఛార్జ్‌ మున్షీని ఉద్దేశిస్తూ జగ్గారెడ్డి పలు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇన్‌ఛార్జ్‌ పార్టీని చంపేయాలని చూస్తున్నారా అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు… ఆ ఫంక్షన్‌కు వెళ్లిన పలువురు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Also Read : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త సరికొత్త రికార్డు.. కారణమేంటి?

మరోవైపు క్యాబినెట్ విస్తర‌ణ‌, నామినేటెడ్ పోస్టుల‌కు సంబంధించి ఆశావహుల జాబితాలో కొందరి పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ఇన్‌ఛార్జ్‌లకు, పెద్ద నేతలకు దగ్గరి వారు కావడమే పదవికి అర్హతగా మారడం దారుణమని జగ్గారెడ్డి చెబుతున్నారు. పదవుల విషయంలో పార్టీ నేతలతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని జగ్గారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జ‌గ్గారెడ్డి మాట్లాడిన అంశాలపై పలువురు సీనియర్ నేతలు సైతం గొంతు కలుపుతున్నారు. బయటకి మాట్లాడకపోయినా జగ్గారెడ్డి మాట్లాడేది సరైందని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి తోచింది వారు మాట్లాడడం చాలా సింపుల్ విషయం అయినప్పటికీ.. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతాయనే చెప్పాలి. ఇక ఈ సమస్యను కాంగ్రెస్ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్