Saturday, September 13, 2025 01:30 AM
Saturday, September 13, 2025 01:30 AM
roots

మళ్లీ నేనే వస్తా… దువ్వాడ మాస్ వార్నింగ్…!

వైసీపీ నేతల్లో నోటి దుల ఉన్న నేతల్లో అగ్రస్థానంలో ఉండే లీడర్ దువ్వాడ శ్రీనివాస్. అధినేతపై ఎక్కడ లేని ప్రేమ కురిపించడంతో పాటు ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నానా దుర్భాషలాడటం వల్ల ఏకంగా ఎమ్మెల్సీ పదవి కొట్టేశారు. ఇక వీటన్నిటికి తోడు కుటుంబ తగాదాలతో, పెళ్లి చేసుకోకుండానే మరో మహిళతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ దాదాపు ఐదు నెలలుగా నిత్యం వార్తల్లో నానుతూనే ఉన్నారు. ప్రజలు ఎంత ఛీ కొట్టినా సరే… వాళ్లిద్దరు మాత్రం కలిసే తిరుగుతున్నారు. ఇటీవల తన ప్రేయసి దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. టెక్కలిలో నిర్వహించిన ఈ వేడుకకు వైసీపీ నేతలు, కార్యకర్తలను ఆహ్వానించారు.

Also Read: ఫ్యూచర్ లో కూడా ఏకగ్రీవమే… బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్

కానీ ఆ కార్యక్రమంతోనే వైసీపీలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. 2024 ఎన్నికల్లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోనే దువ్వాడ కుటుంబంలో తగాదాలు బయటపడ్డాయి. దీంతో పార్టీ పరువు పోయిందని భావించిన జగన్.. నియోజకవర్గం ఇంఛార్జ్‌ను మార్చేశారు. టెక్కలి ఇంఛార్జ్‌గా పేరాడ తిలక్‌ను నియమించారు. అయితే ఇప్పుడు ఇదే టెక్కలి నియోజకవర్గంలో పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. టెక్కలిలో ఇప్పటికే ఉన్న పార్టీ కార్యాలయాన్ని పేరాడ తిలక్ తీసేశారు. ప్రత్యేకంగా మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

దీని ప్రారంభోత్సవానికి జిల్లాకు చెందిన వైసీపీ నేతలను ఆహ్వానించారు. కానీ అదే నియోజకవర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. దీంతో టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ వర్సెస్ పేరాడ అనేలా పార్టీ చీలిపోయింది. అయితే రెండు రోజుల క్రితం దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్ సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేశారు. కేవలం కుటుంబ తగాదాల వల్ల మాత్రమే తాను టెక్కలి రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నానని… అంతే తప్ప… ఎన్నికల్లో పోటీ చేసేది నేనే అంటూ దువ్వాడ శ్రీనివాస్ తెగేసి చెప్పారు. ఎవరైనా సరే.. నా తర్వాతే.. క్యాడర్ ఇబ్బంది పడకూడదనే ప్రస్తుతం తిలక్‌ను ఇంఛార్జ్‌గా నియమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: పుష్ప అరెస్ట్… పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటం…!

కేవలం కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని మాత్రమే ఈ నియామకం జరిగింది తప్ప ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే… కావాలంటే రాసిపెట్టుకో.. అంటూ బహిరంగ సవాల్ విసిరారు. దువ్వాడ చేసిన వ్యాఖ్యలు టెక్కలి వైసీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. మరి పేరాడ తిలక్ పరిస్థితి ఏమిటని కొందరు నేతలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. ఇన్ని రోజులు పార్టీని తిలక్ నడిపితే.. చివర్లో వచ్చి దువ్వాడ పోటీ చేస్తాడా అని చర్చించుకుంటున్నారు. మరి కొందరైతే.. ముందు ఇంటిని చక్కబెట్టుకో.. తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్