Friday, September 12, 2025 07:31 PM
Friday, September 12, 2025 07:31 PM
roots

పుష్ప అరెస్ట్… పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటం…!

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో ఒక మహిళ మృతికి కారణమంటూ హీరో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే విషయం పొలిటికల్‌‌గా పెద్ద దుమారం రేపుతోంది. వాస్తవానికి తొక్కిసలాట ఘటనలకు సంబంధించి… సెలబ్రెటీల జోలికి పెద్దగా వెళ్లరు. నిర్వాహకులపై కేసులు పెట్టి అరెస్టులతో సరిపెడతారు. అయితే సంధ్య థియేటర్ ఘటన విషయంలో మాత్రం తప్పు అల్లు అర్జున్‌దే అనేలా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు అల్లు అర్జున్ అరెస్టు కూడా సరిగ్గా లేదని విమర్శలు చేస్తున్నారు. అలా అయితే హైడ్రా కూల్చివేతల కారణంగా ఇద్దరు చనిపోయారని… అందుకు కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక అల్లు అర్జున్ అరెస్టును మరో మాజీ మంత్రి హరీష్‌రావు కూడా ఖండించారు. ఇందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కావడమే అంటూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌పై అక్కసుతోనే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని హరీష్ సహా ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Also Read : కేటిఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం… గవర్నర్ గ్రీన్ సిగ్నల్…?

ఇక ఇదే విషయంపై ఏపీలో వైసీపీ నేతలు కూడా మేమున్నాం బన్నీ వెంట అంటున్నారు. అరెస్టు జరిగి గంట కూడా కాకముందే… వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టేశారు. ఆ పిల్లాడు చాలా మంచోడు.. జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు కూడా… అతని అరెస్టు నన్ను చాలా బాధించింది అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో అరెస్టుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కారణమనేలా పరోక్షంగా విమర్శలు చేశారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని… అలా అయితే గోదావరి పుష్కరాలు, కందుకూరు ఘటన సమయంలో జరిగిన తొక్కిసలాటలకు చంద్రబాబును బాధ్యుడిని చేసి అరెస్టు చేయాలని కూడా వింత వాదన తెరపైకి తీసుకువచ్చారు. అసలు ఘటన జరిగింది హైదరాబాద్‌లో… కేసు నమోదైంది చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో… అరెస్టు చేసింది తెలంగాణ పోలీసులు… మరి ఈ అరెస్టుకు చంద్రబాబుకు ఏమిటి సంబంధం అనే ప్రశ్నకు మాత్రం వైసీపీ నేతల దగ్గర సమాధానం లేదు.

Also Read : తెలుగు రాష్ట్రాలకు షేక్ చేస్తున్న భాయ్ అరెస్ట్… చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు సినీ ప్రముఖులు

ఇక ఇదే అరెస్టుపై బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం మరో వింత వాదనతో ట్రోల్ చేస్తోంది. పుష్ప 2 సక్సెస్ మీట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. థ్యాంక్యూ టూ సీఎం… అంటూ నీళ్లు నమిలాడు… పేరు అంటూ పక్కనే ఉన్న వాళ్లను అడిగాడు బన్నీ. ఈ వీడియోను ఇప్పుడు బయటకు తీసిన బీఆర్ఎస్ అభిమానులు… ఏడాదిగా పదవిలో ఉన్న సీఎం పేరు మర్చిపోయినందుకు రేవంత్ ఈగో హర్ట్ అయ్యిందని… అందుకే అరెస్టు చేయించాడని కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే… సీఎం రేవంత్ రెడ్డి అంటూ జైలులో ఇంపోజీషన్ రాయిస్తారేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి బన్నీ అరెస్టును కూడా పొలిటికల్ మైలేజ్ కోసం అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ నేతలు వాడేసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్