Friday, September 12, 2025 07:31 PM
Friday, September 12, 2025 07:31 PM
roots

టీటీడీ మరో కీలక నిర్ణయం…!

తిరుమల పవిత్రతను కాపాడే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. చివరికి టికెట్ల విక్రయంలో కూడా అడ్డగోలు దందా సాగింది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను కూడా నాటి మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక వీటికి తోడుగా అన్నదాన విభాగంలో నాసి రకం వంటకాలు, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి… ఇలా లెక్కలేనన్ని ఆరోపణలు. ఇదే సమయంలో కొందరు టీటీడీ సిబ్బంది తీరుపై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీవారి భక్తులకు సకల సౌకర్యాలు అందించటమే టీటీడీ ఉద్యోగుల ప్రధమ కర్తవ్యం. అది వసతి గదుల కేటాయింపు మొదలు, కల్యాణ కట్ట, క్యూ లైన్, ప్రసాద వితరణ, ప్రసాదం కౌంటర్, పుస్తక విక్రయం… ఇలా అన్ని విభాగాల్లో కూడా ఉద్యోగులు భక్తులతో సౌమ్యంగా వ్యవహరించాలి.

Also Read : మీవల్లే ఇదంతా.. ఎస్పీలు, డీఎస్పీలపై చంద్రబాబు ఫైర్

కానీ ఆ విధంగా చాలా విభాగాల్లో జరగటం లేదు. తిరుమల కొండకు వచ్చే భక్తుల్లో చాలా మందికి వసతి గది కేటాయింపు మొదలు… దర్శనం ఎటు వైపు వెళ్లాలనే సమాచారం కూడా తెలియదు. అందుకోసం అక్కడే ఉన్న సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలా అడుగుతున్న వారిపట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. చివరికి క్యూ లైన్‌లో కూడా ఉద్యోగుల తీరుపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. వీటిని గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా భక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు… అదే సమయంలో ఆరోపణలు చేసిన భక్తులను తెలుగుదేశం పార్టీకి చెందిన వారంటూ ముద్ర కూడా వేశారు.

Also Read : టెస్ట్ క్రికెట్ లో లోయేస్ట్ టార్గెట్స్ ఇవే

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా తిరుమల పవిత్రను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా కార్యచరణ మొదలుపెట్టింది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు చెక్ పెట్టింది. కల్తీ నెయ్యి వినియోగంపై విచారణకు ఆదేశించింది. అలాగే క్యూ లైన్ నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఎందుకంటే కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని… భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిచే ఉద్యోగులపై చర్యలకు వెనుకాడేది లేదని వెల్లడించారు. నేమ్ బ్యాడ్జ్ ఇవ్వడం ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. శ్రీనివాసులు దర్శనం కోసంం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు నేమ్ బ్యాడ్జ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానన్నారు. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్ త్వరలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానంటూ ఛైర్మన్ బీఆర్ నాయుడు పోస్ట్ పెట్టారు. ఈ నిర్ణయం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బ్యాడ్జ్‌లు తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్