Friday, September 12, 2025 07:20 PM
Friday, September 12, 2025 07:20 PM
roots

రోధిస్తున్న తల్లి.. క్షోభిస్తున్న వైఎస్ఆర్ ఆత్మ..!

అప్పుడు వైఎస్ ను చూసిన వాళ్ళు… ఇప్పుడు జగన్ ను చూస్తున్న వాళ్ళు చెప్పేమాట ఒక్కటే… అసలు వైఎస్ వైఖరికి.. జగన్ వైఖరికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని. అవును జరిగేవి గమనిస్తుంటే ఇది నిజమే అనే భావన కలుగుతుంది. వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు… రాజారెడ్డి వారసులకు మాత్రమే రాజకీయాల్లో ప్రాధాన్యత ఉండేది. వైఎస్ మరణం తర్వాత… వైఎస్ నిర్మించుకున్న సామ్రాజ్యంలో వైఎస్ భాస్కర రెడ్డి కుటుంబం అడుగు పెట్టింది. వివేకా బ్రతికి ఉన్న సమయంలో కూడా వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది.

అసలు వివేకాను మరణానికి వాళ్ళే కారణం అనే క్లారిటీ ప్రజలకు ఉన్నా… జగన్ మాత్రం సొంత బాబాయి మరణానికి కారణం అయిన వారిని మోస్తున్నారు అనే కోపం వైఎస్ అభిమానుల్లో బలంగా ఉంది. కుటుంబంలో ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే వైఎస్ వాటిని బయటకు రానీయలేదు. షర్మిలకు గాని, జగన్ కు గాని… ఇతర కుటుంబ సభ్యుల్లో గాని విభేదాలు ఉంటే వైఎస్ వాటిని నాలుగు గోడల మధ్యనే పరిష్కరించేవారు. కాని జగన్ మాత్రం ఘర్ ఘర్ కి కహానిని కోర్ట్ వరకు తీసుకెళ్ళి… సొంత చెల్లెలిని, కన్న తల్లిని కోర్ట్ కు లాగారు.

Also Read: జగన్ బెయిల్ రద్దుకి రంగం సిద్ధం..?

సొంత కుటుంబ సభ్యులపైనే సొంత పార్టీ నేతలతో ఆరోపణలు చేయించడం విస్మయానికి గురి చేసింది. ఆస్తి పంపకాల విషయంలో జగన్ ఇప్పుడు పెద్ద మనిషిలా వ్యవహరించాల్సి ఉంటుంది. రాజీ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. కాని కుటుంబ సభ్యులను కోర్ట్ కు లాగడం, చివరకు సొంత తల్లిని కూడా వేధించడం చూస్తుంటే చాలా మందికి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తాను చెప్పేవి అన్నీ నిజాలే అని షర్మిల బైబిల్ పై, బిడ్డలపై ప్రమాణం చేస్తుంటే… జగన్ గాని, వైవీ సుబ్బారెడ్డి గాని ప్రమాణం చేయడానికి ముందుకు రాలేదు.

Also Read: షర్మిలతో పోరాటం అంటే.. జగన్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా?

ఒకరి తర్వాత ఒకరు వైసీపీ నేతలను షర్మిలపై ఉసిగొల్పడం, సోషల్ మీడియాలో ఆమెను వ్యక్తిగత విషయాలతో తిట్టించడం చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది. పాలనలో కూడా జగన్ కుటుంబ సభ్యుల కంటే తన మాట వినే వాళ్ళకే అప్పట్లో ప్రాధాన్యత ఇచ్చేవారు. వైఎస్ ఈ తరహా చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదు. ఇదే ఇప్పుడు వైఎస్ అభిమానుల్లో జగన్ పై కోపాన్ని పెంచుతుంది. ఇప్పటివరకు వైఎస్ జగన్ కి మద్దతుగా ఉన్న వారు.. ఇకముందు షర్మిల వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్