ఆంధ్రప్రదేశ్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ షర్మిలకు ఆమె సోదరుడు వైఎస్ జగన్ కు మధ్య జరుగుతున్న ఆస్తుల యుద్ధంపై పెద్ద ఆసక్తే ఉంది. సోషల్ మీడియా వేదికగా దీనిపై ఎన్నో అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయంగా ఈ విషయం జగన్ కు ఇబ్బందికర అంశంగానే చెప్పాలి. షర్మిల ఆస్తుల కోసం పోరాటం చేస్తుంటే… జగన్ సైలెంట్ గా ఆమెపై, తల్లి విజయలక్ష్మి పై కోర్ట్ లో కేసు ఫైల్ చేసారు.
Also Read: ఈ నాటకాలు ఇంకెన్నాళ్లు జగన్..?
దీనితో అసలు ఏం జరుగుతుందో వైఎస్ అభిమానులకు సైతం అర్ధం కాని పరిస్థితి. ఇదిలా ఉంచితే ఇప్పుడు షర్మిలను వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేయించి వైసీపీ నేతలతో తిట్టించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్నాళ్ళు బయటకు రాని నాయకులు ఇప్పుడు షర్మిలపై మాటల యుద్దానికి జగన్ ఉసిగొల్పడం ఆశ్చర్యం కలిగించే విషయంగా చెప్పాలి. ఇక ఇదే సమయంలో జగన్ తన స్టైల్ లో షర్మిలను తిట్టించడానికి రెడీ అవుతున్నారు. ఎన్నికల ముందే ఆమెపై పలు అసభ్యకర ఆరోపణలు చేయించిన వైసీపీ అగ్ర నాయకత్వం ఇప్పుడు మరోసారి ఆమెను విమర్శించేందుకు సిద్దమవుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కార్యకర్తల కోసం పలు ఫోటోలను పంపారట సజ్జల భార్గవ్. షర్మిలను తిట్టడానికి కంటెంట్ కూడా సిద్దం చేయించడం, ఆమెకు సంబంధించిన పలు వ్యక్తిగత అంశాలను, గతంలో ఆమెపై వచ్చిన రూమర్లను, ఆమె లైఫ్ ను ఎంజాయ్ చేసే సమయంలో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయించడానికి సిద్దం అయ్యారు.
Also Read: జగన్ బెయిల్ రద్దుకి రంగం సిద్ధం..?
విదేశాల్లో షర్మిల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వెళ్ళిన సమయంలో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమెపై ఎదురు దాడి చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే వైసీపీ నేతలతో ఆమెను తిట్టిస్తున్న అధిష్టానం… ఈ తరహా చర్యలకు దిగాలని భావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.