తెలంగాణాలో హైడ్రా ఇప్పుడు చట్టబద్దం. ఓ ఏసీబీ ఎలాగో, ఓ సిఐడీ ఎలాగో, ఓ ఎక్సైజ్ శాఖ ఎలానో హైడ్రా కూడా అలానే. ఇన్నాళ్ళు హైడ్రా చట్టబద్దం కాదు కావాలని చేస్తున్నారని ఆరోపణలు చేసిన వాళ్ళు అందరికి రేవంత్ సర్కార్ తన చర్యలతో సమాధానం చెప్పేసింది. హైడ్రా ఇప్పుడు చట్టబద్దం అయింది. ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చేసారు. కాబట్టి కోర్ట్ కి వెళ్ళినా కూడా కోర్ట్ లు కూడా ఆపే అవకాశం నూటికి కోటి శాతం ఉండదు. కేబినేట్ లో ఆమోదం ఆ తర్వాత గవర్నర్ టేబుల్ పైకి బిల్ వెళ్ళడం ఆమోదం తెలపడం జరిగాయి.
ఇక హైడ్రా గురించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. అసలు ఇప్పుడు హైడ్రాకు చట్టబద్దత ఎందుకు కలిగించారు అంటే… ఇప్పటి వరకు కూల్చిన వాటిల్లో కేవలం అక్కినేని నాగార్జున ది మాత్రమే సంచలనం అయింది. ఇక నుంచి అన్నీ సంచలనాలే కాబోతున్నాయని టాక్. ఓ మల్లారెడ్డి, ఓ రాజేశ్వర్ రెడ్డి, ఓ ఓవైసీ… ఇలా హైడ్రాకు పెద్ద లక్ష్యాలే ఉన్నాయి. వాళ్ళవి కూల్చకుండా సామాన్యులవి కూలిస్తే ఇబ్బందులు వస్తాయి. వాళ్ళవి కూల్చి సామాన్యులవి కూడా కూలిస్తే పెద్ద సమస్య ఉండదు.
Read Also : అవినీతి ఆరోపణల పై కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
అందుకే ఇక హైడ్రా స్పీడ్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. గవర్నర్ సంతకంతో కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే విషయం స్పష్టత వచ్చేసింది. ఇక ప్రత్యేక అధికారాలు కాబట్టి కోర్ట్ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అకాడమిక్ ఇయర్ పూర్తైన తర్వాత కొన్ని కూల్చి ఈ లోపు మరికొన్ని కూల్చడానికి హైడ్రా సిద్దమవుతోంది. మల్లారెడ్డి కాలేజీల విషయంలో ముందు చర్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే మంత్రులకు చెందిన భవనాల విషయంలో కూడా హైడ్రా కఠినంగా వ్యవహరించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.