ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులు ఎప్పటి నుంచో నూతన మద్యం పాలసీ గురించి ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళు యాసిడ్, స్పిరిట్ లు, సానిటైజర్ లు ఫ్యాన్సీ షాపుల్లో కొనుక్కుని తాగిన జనాలు ఇప్పుడు మాత్రం స్వచ్చమైన మందు తాగేందుకు సిద్దమవుతున్నారు. మద్యపాన నిషేధం మాయ నుంచి జూన్ లో బయటకు వచ్చిన జనాలు ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత స్వచ్చమైన మందు రుచి చూసేందుకు సిద్దమవుతున్నారు. గుడ్డు పెట్టె కోడికే బాధ తెలుసు అన్నట్టు… మద్యానికి బానిస అయిన బతుకులు అంత సులువుగా బయటకు రావడం కష్టం.
అందుకే ఇప్పుడు మందుబాబులు నూతన మద్యం పాలసీ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో నేటినుంచి నూతన మద్యం పాలసీ అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మద్యం దుకాణాల లైసెన్స్ జారీ కి నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్. రెండేళ్ల కాల పరిమితితో ఈ అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ లైసెన్సులు జారీకి ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈనెల 11న లాటరీ నిర్వహిస్తారు.
Read Also : స్వామీజీలతో జగన్ నయా ప్లాన్
12 నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి వస్తాయి. ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేస్తారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ వసూలు చేస్తారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు అలాగే ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్సు రుసుము తీసుకుంటారు. రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో చెల్లించాల్సి ఉన్న లైసెన్సు రుసుము వసూలు చేయడం జరుగుతుంది. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో ప్రీమియం షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి తో ఏడాదికి కోటి రూపాయల లైసెన్స్ ఫీజు ఉండనుంది.