Sunday, October 19, 2025 09:13 PM
Sunday, October 19, 2025 09:13 PM
roots

నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు

ఏపీలో రాజకీయ మార్పు నెల్లూరు జిల్లా నుంచే మొదలవబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జగన్ సర్కార్ పై విమర్శలు చేయడానికి విపక్షాలే భయపడుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలగా ఉంటూనే తమ నిరసన గళం వినిపించింది నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పదికి పది సీట్లు ఇచ్చిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పరిస్ధితుల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి పార్టీ విప్ ను ధిక్కరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటేశారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం ఈ ముగ్గురిని సస్పెండ్ చేసింది.

దీంతో వీరంతా టీడీపీకి దగ్గరవుతున్నారు. అయితే జిల్లాలో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలకు ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వరుసగా క్లారిటీలు ఇస్తున్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తో పాటు వైసీపీ బహిష్కత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చించారు. చివరికి నెల్లూరు రూరల్ సీటు నుంచి కోటంరెడ్డినే బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సీటును త్యాగం చేస్తున్న అజీజ్ కు భవిష్యత్తులో న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

వాస్తవానికి వైసీపీ బహిష్కరణ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అప్పటికే ఇన్ఛార్జ్ గా ఉన్న అబ్దుల్ అజీజ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కోటంరెడ్డి చేరిక కూడా ఆలస్యమైంది. కానీ ఎన్నికలు దగ్గరపడుతుండటం, లోకేష్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో చంద్రబాబు ఇద్దరు నేతల్ని పిలిపించి మాట్లాడారు. అనంతరం కోటంరెడ్డిని లోకేష్ పాదయాత్ర బాధ్యతలు సమన్వయం చేసే బాధ్యత అప్పగించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డికి ఈ బాధ్యత అప్పగించారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి అభ్యర్ధిత్వం ఖరారుతో టీడీపీ మొత్తం మూడు సీట్లను ఖరారు చేసినట్లయింది. ఇప్పటికే నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణను మరోసారి బరిలోకి దింపాలని నిర్ణయించిన చంద్రబాబు, ఆత్మకూరు నుంచి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని పోటీ చేయించాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు రూరల్ నుంచి కోటంరెడ్డి పేరు కూడా ఖరారు కావడంతో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఖరారు అయినట్లయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్