Friday, October 23, 2026 02:01 PM
Friday, October 23, 2026 02:01 PM

మేఘన ప్రాణాలకు ముప్పు.. జోగి కుటుంబంపై అనుమానాలు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘనపై మరోసారి హత్యాయత్నం జరిగిందనే అనుమానాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మేఘన, ఆమె తండ్రి కృష్ణ ప్రయాణిస్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం యాక్సిడెంట్ కాదని, మేఘనను అంతం చేసేందుకు జరిగిన కుట్రగా చర్చ జరుగుతోంది.

Also Read : ప్రొటోకాల్స్ పక్కనపెట్టి సీఎం ఇంటికి జనసేనాని..!

ఈ నెల 15న విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడ వైపు కారులో వెళ్తుండగా.. NTR జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బస్సు మేఘన కారును ఢీకొనడంతో వాహనం కొంత భాగం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ మేఘన, ఆమె తండ్రి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ ఘటన వెనుక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ ప్రమాదంపై మేఘన తండ్రి కృష్ణ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ..మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయంపై సంచలన ఆరోపణలు చేశారు. తమకు ప్రాణహాని ఉందని, బస్సు డ్రైవర్‌తో పాటు ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులపై లోతైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : వైసీపీ నేతలు ఇప్పుడైనా నామినేషన్లు వేస్తారా..?

అయితే, ఈ ఘటనకు బలమైన నేపథ్యం ఉంది. 3 నెలల కిందటే మేఘన తన మామ జోగి రమేష్, భర్త రాజీవ్, ఇతర కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలతో ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో గోవా పర్యటనలో తనను నీటిలో తోసి చంపే ప్రయత్నం చేశారని ఆ టైంలో మేఘన ఆరోపించారు. జోగి ఫ్యామిలీ నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్పట్లోనే మేఘన స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో కారు ప్రమాదం జరగడంతో, ఇది సాధారణ ప్రమాదం కాదని, మేఘనను అడ్డు తొలగించేందుకు పన్నిన పక్కా ప్లాన్ అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలోని వేధింపులు, ప్రస్తుత ఫిర్యాదు నేపథ్యంలో ఈ కేసు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కదిరి వైసీపీలో భగ్గుమన్న...

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్సార్...

బ్రేకింగ్ : మరోసారి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మేయర్ ఖర్చు భారం...

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ...

వైసీపీ నేతలకు రాచమర్యాదలు.....

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్...

వైసీపీ నేతలు ఇప్పుడైనా...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల వేళ...

ప్రొటోకాల్స్ పక్కనపెట్టి సీఎం...

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో...

పోల్స్