Friday, October 23, 2026 01:32 PM
Friday, October 23, 2026 01:32 PM

వైసీపీ నేతలకు రాచమర్యాదలు.. టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్..!

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నేకొత్తపల్లి, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో పోలీసుల వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ల కేంద్రాల వద్ద శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఒక పక్షానికి కొమ్ముకాస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చెన్నేకొత్తపల్లి నామినేషన్ల కేంద్రం వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.

Also Read : ప్రొటోకాల్స్ పక్కనపెట్టి సీఎం ఇంటికి జనసేనాని..!

నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రంలోకి పరిమిత సంఖ్యలోనే అనుమతించాల్సి ఉండగా, ఖాకీలు ఏకంగా 30 మంది వైసీపీ నేతలను ఒకేసారి లోపలికి తీసుకెళ్లడం గమనార్హం. ప్రతిపక్ష వైసీపీ నేతలకు పోలీసులు రాచమర్యాదలు కల్పిస్తూ ఎస్కార్ట్‌గా నిలవడంపై స్థానిక కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల పక్షపాత వైఖరిని ప్రశ్నించినందుకు బత్తలపల్లి, తాడిమర్రి పరిధిలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడం గమనార్హం.

Also Read : రాచమల్లు.. బరితెగింపు అంటే ఇదే..!

వైసీపీ నాయకులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, వారి నామినేషన్లు సజావుగా సాగేలా చూసేందుకే పోలీసులు వ్యూహాత్మకంగా టీడీపీ శ్రేణులపై లాఠీలు ఝులిపించారని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పోలీసుల ఈ ఏకపక్ష లాఠీఛార్జ్ ఘటనలపై టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని స్థానిక నేతలు హెచ్చరించడంతో ధర్మవరం సబ్ డివిజన్ రాజకీయం మరింత వేడెక్కింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కదిరి వైసీపీలో భగ్గుమన్న...

శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్సార్...

బ్రేకింగ్ : మరోసారి...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మేఘన ప్రాణాలకు ముప్పు.....

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి...

మేయర్ ఖర్చు భారం...

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ...

వైసీపీ నేతలు ఇప్పుడైనా...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల వేళ...

ప్రొటోకాల్స్ పక్కనపెట్టి సీఎం...

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో...

పోల్స్