Monday, October 19, 2026 04:42 PM
Monday, October 19, 2026 04:42 PM

వైసీపీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు..!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, భద్రతపై హైకోర్టును ఆశ్రయించిన ప్రతిపక్ష వైసిపీకి న్యాయస్థానంలో నిరాశ ఎదురైంది. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో నిష్పాక్షికమైన పోలింగ్ జరగాలంటే కేంద్ర పారామిలటరీ బలగాలను కేటాయించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రస్తుతమున్న స్థానిక పోలీసు భద్రత సరిపోతుందని అభిప్రాయపడుతూ ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Also read : మార్కెట్లో కనపడని ₹500 నోట్లు.. అసలేం జరుగుతోంది..?

ఈ న్యాయపోరాటంలో వైసీపీకి వరుసగా రెండోసారి భంగపాటు ఎదురుకావడం గమనార్హం. స్థానిక ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర బలగాలను రంగంలోకి దించాలంటూ సదరు పార్టీ నాయకులు మొదట హైకోర్టు సింగిల్ జడ్జిని ఆశ్రయించారు. అయితే క్షేత్రస్థాయి నివేదికలను, భద్రతా పరిస్థితులను పరిశీలించిన సింగిల్ జడ్జి.. ప్రస్తుత తరుణంలో పారామిలటరీ బలగాలను రప్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ఆ పిటిషన్‌ను మొదట్లోనే తిరస్కరించారు.

Also read : పల్లె పండుగ రోడ్డు ధ్వంసంపై సీఎం, డిప్యూటి సిఎం సీరియస్..!

సింగిల్ జడ్జి ఇచ్చిన ఆ తీర్పును సవాల్ చేస్తూ వైపీ లీగల్ సెల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. కానీ అక్కడ కూడా పార్టీకి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు రాకపోగా, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ.. డివిజన్ బెంచ్ సైతం వైఎస్సార్‌సీపీ అప్పీల్‌ను కొట్టివేసింది. దీంతో స్థానిక ఎన్నికల భద్రతకు సంబంధించి వైఎస్సార్‌సీపీ చేసిన ప్రయత్నాలన్నింటికీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పులివెందులపై వైసీపీ పట్టు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా...

పల్లె పండుగ రోడ్డు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె...

జనసేనకు టీడీపీ సవాల్.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి....

జగన్.. వారం క్రితం...

అదేదో చేయలేక మంగళవారం అన్నాడట.. వెనకటికి...

రాష్ట్రమంతా ప్రశాంతం.. అక్కడ...

ఏపీలో నిజంగానే గొడవలు జరుగుతున్నాయా..? ఏపీలో...

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

పోల్స్