Saturday, October 17, 2026 03:56 PM
Saturday, October 17, 2026 03:56 PM

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి జగన్, గొడ్డలి పార్టీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. పక్కరాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. ఎంపీ మిధున్ రెడ్డి వీధి రౌడీలా వ్యహరించారు. గొడ్డలి పార్టీ నాయకులు ఎన్ని బెదిరింపులకు, దాడులకు పాల్పడినా భయపడేది లేదు… పులివెందుల సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయబోతున్నాం..’ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ధీమా వ్యక్తంచేశారు. పోలీసులు పూర్తి స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవైపు ఈడీ దాడులు, మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసు వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతుండడంతో జగన్ లో ఆందోళన మొదలైందన్నారు. త్వరలో వైసీపీ క్లోజ్ అవ్వడం ఖాయమని మంత్రి సవిత తెలిపారు.

Also Read : సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.. అవినాష్‌ కన్నీరు

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రారంభమైన మొదటిరోజే గొడ్డలి పార్టీ నాయకులు పెట్రేగిపోయారన్నారు. పక్కరాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారన్నారు. తిరుపతి, రాయచోటి, పుంగనూరు, ధర్మవరంతో పాటు పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.

వీధి రౌడీలా ఎంపీ మిధున్ రెడ్డి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైసీపీ నాయకులు విచక్షణ మరిచిపోయి, దాడులకు తెరతీశారని మంత్రి సవిత మండిపడ్డారు. ఎంపీ మిధున్ రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తిసూ…నామినేషన్ కేంద్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారన్నారు. వైసీపీ దౌర్జన్యాలపై తమ నాయకులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. దాడులకు తెగబడిన వారిపై చర్యలకు చట్టపరంగా ముందకెళ్తామన్నారు. పోలీసులు పూర్తి స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారన్నారని మంత్రి సవిత స్పష్టంచేశారు.

Also Read : అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. కారణం..?

వైసీపీ పని క్లోజ్…

గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి సవిత తెలిపారు. వారిలా తమ పార్టీ నాయకులు నామినేషన్లు చించలేదని, బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడడం లేదని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాలన్నది తమ అభిమతమన్నారు. ఒకవైపు ఈడీ వరుస దాడులు, మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని, ప్యాలెస్ పెద్దలు విలవిలలాడుతున్నారని మంత్రి సవిత తెలిపారు. దీంతో ఏం చేయాలో పాలుపోక, జగన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసాలకు తెరతీశారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే. ఆయన మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పని ముగిసిందని, త్వరలో ఆ పార్టీ క్లోజ్ అవ్వబోతోందని మంత్రి సవిత తెలిపారు.

‘స్థానికం’లో క్లీన్ స్వీప్ చేస్తున్నాం…

అయిదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు దోపిడీ, దౌర్జన్యాలతో కాలం గడిపారని, వారికి ఓటు అడిగే హక్కు కూడా లేదని మంత్రి సవిత అన్నారు. పులివెందుల సహా అన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నాయని ధీమా వ్యక్తంచేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, అభ్యర్థి ఎవరైనా విజయానికి కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

నాడు ‘రక్తచరిత్ర’.. నేడు...

నారాసుర రక్త చరిత్ర.. ఈ పేరు...

అప్పుడు.. ఇప్పుడు.. మార్పు...

"అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. అప్పుడు...

పోల్స్