Saturday, October 17, 2026 11:41 AM
Saturday, October 17, 2026 11:41 AM

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.. అవినాష్‌ కన్నీరు

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్ రెడ్డి పాత్రపై ఎన్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక కుట్రదారుగా అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ED అధికారులు బుధవారం దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. వివేకా హత్య కోసం ఖర్చు చేయాలనుకున్న రూ.40 కోట్ల మూలాలు, ఆ ఆర్థిక లావాదేవీలతో అవినాష్‌రెడ్డికి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి ఉన్న సంబంధాలపై ED అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read : నాడు ‘రక్తచరిత్ర’.. నేడు ‘గొడ్డలి’! సాక్షి తీరు మారలేదా?

ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితులకు అడ్వాన్స్‌గా చెల్లించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడి నుంచి సమకూరిందనే కోణంలో ED అధికారులు ప్రశ్నించగా, అవినాష్‌రెడ్డి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వాంగ్మూలం ప్రకారం, ఈ సుపారీ వెనుక భారీ ఎత్తున మనీలాండరింగ్‌ జరిగినట్లు ED ప్రాథమికంగా గుర్తించింది. శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ద్వారా దస్తగిరి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలకు అడ్వాన్స్‌లు ఎలా చేరాయనే దానిపై మునుపటి సాక్షులు, నిందితులు చెప్పిన విషయాలకు, అవినాష్‌రెడ్డి ఇస్తున్న పొంతన లేని సమాధానాలకు మధ్య తేడాలను ED అధికారులు బట్టబయలు చేశారు.

Also Read : తిరుపతిలో హైటెన్షన్.. రెచ్చిపోయిన భూమన అభినయ్‌రెడ్డి..?

ఇప్పటివరకు సేకరించిన లావాదేవీల ఆధారాలు, పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను అవినాష్‌రెడ్డి ముందుంచినప్పటికీ, ఆయన పూర్తిస్థాయిలో సహకరించలేదు. దీంతో అవినాష్‌ రెడ్డిని గురువారం కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బుధవారం విచారణ ముగిసిన తర్వాత మీడియా కంటపడకుండా అవినాష్‌రెడ్డి వెనుక వైపు మార్గం గుండా వెళ్లిపోవడం గమనార్హం. CBI దర్యాప్తు సమయంలో అరెస్టు నుంచి తప్పించుకున్న అవినాష్‌రెడ్డిని, ఈ సారి మనీలాండరింగ్ కోణంలో కూపీ లాగుతున్న ED అరెస్టు చేస్తుందా అని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Also Read : అమెరికా సంచలన వ్యూహం.. ఇరాన్‌పై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్..?

మొత్తానికి, వివేకా హత్య కేసులో ఆర్థిక లావాదేవీలన్నీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైపే వేలెత్తి చూపుతున్నాయని ED గట్టిగా భావిస్తోంది. ఇతర నిందితులతో ఉన్న సంబంధాలు, ఆదాయ-వ్యయాల వివరాలపై ED అధికారులు ఆరా తీస్తుండటంతో అవినాష్‌ ఫ్యామిలీ గుట్టు రట్టు అవుతోంది. ఈ విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంచలన పరిణామాలకు దారి తీస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

నాడు ‘రక్తచరిత్ర’.. నేడు...

నారాసుర రక్త చరిత్ర.. ఈ పేరు...

అప్పుడు.. ఇప్పుడు.. మార్పు...

"అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. అప్పుడు...

తిరుపతిలో హైటెన్షన్.. రెచ్చిపోయిన...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల...

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

కూటమి సీట్ల పంపకం...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార...

పోల్స్