Friday, October 16, 2026 10:03 PM
Friday, October 16, 2026 10:03 PM

నాడు ‘రక్తచరిత్ర’.. నేడు ‘గొడ్డలి’! సాక్షి తీరు మారలేదా?

నారాసుర రక్త చరిత్ర.. ఈ పేరు ఆంధ్రప్రదేశ్‌లో చాలా మందికి తెలుసు. ఈ పేరుతోనే ఏపీ ప్రజలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలువునా మోసం చేసింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడంతో.. అదే నిజమని ప్రజలు నమ్మేశారు. ఇంతకూ ఆ అబద్ధం చెప్పింది ఎవరూ..? ఆ అబద్ధం ఎక్కడ నుంచి మొదలైంది..? ఈ ప్రశ్నలకు జవాబు హైదరాబాద్ కేంద్రంగా ఏపీలో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడే ఇందిరా టెలివిజన్ అనే సంస్థ.. అంటే.. వైసీపీ అధికార కరపత్రం సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానల్. ఈ రెండు వార్తల కంటే.. వైసీపీ భజనే ఎక్కువ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే వార్తల ముసుగులో చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీ పైన విషం చిమ్మటం మాత్రమే వీటి ఏకైక అజెండా.

Also Read : అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. కారణం..?

2019 మార్చి 15.. తెల్లవారు జామున సాక్షి న్యూస్ ఛానల్‌లో ముందుగా వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండె పోటుతో మృతి అని స్క్రోలింగ్ వచ్చింది. వైసీపీ అధికార న్యూస్ ఛానల్ కావడంతో అంతా నిజమే అనుకున్నారు. నాటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా గుండెపోటుతోనే వివేకా మృతి చెందారని ప్రకటించారు. కానీ.. ఓ అరగంట తర్వాత సీన్ మారిపోయింది. తరువాత అది హత్యగా తేలింది. దాంతో వివేకా గుండెపోటుతో కాదు.. గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యారు అని మార్చేశారు. ఇక అక్కడ నుంచే సాక్షి సహా వైసీపీ నేతల డ్రామా మొదలైంది. గుండెపోటుతో మృతి చెందినప్పుడు ఎలాంటి అనుమానాలు లేవు.. కానీ హత్య అని బయటకు రాగానే.. వెంటనే.. చంద్రబాబు చేశారు, టీడీపీ నేతలు చేశారు.. అంటూ మొదలుపెట్టారు. ఇక అదుగో పులి అంటే.. ఇదుగో తోక అనే బ్యాచ్ కూడా.. అవునవును.. వివేకాను చంద్రబాబు హత్య చేశాడు.. ఆయనే నరికేశాడు.. నేను చూశాను.. అన్నట్లు కట్టుకథలు అల్లేశారు.

Sakshi fake news on chandrababu

ఇక సాక్షి పత్రికలో అయితే.. ఓ ముఖ్యమంత్రి చేతిలో రక్తం కారుతున్న కత్తి పెట్టి.. సీఎం ఇంటి పేరును ప్రస్తావిస్తూ.. నారా సుర రక్తచరిత్ర అంటూ పెద్ద బ్యానర్ వార్త రాసుకొచ్చారు. అంతే.. వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా మొత్తం.. నారాసుర రక్త చరిత్ర అనే తప్పుడు వార్తను బాగా సర్క్యులేట్ చేశాయి. అంతే.. జనం కూడా నిజమేనేమో అని నమ్మేశారు. కొంతమంది అయితే.. “పాపం జగన్ బాబాయ్‌ని చంపేశారంట.. అయ్యో.. తండ్రిలేని పిల్లోడు కదా..” ఓదార్చారు కూడా. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె కోర్టులో న్యాయపోరాటం మొదలుపెట్టిన తర్వాత అసలు హంతకులు ఎవరో బయటకు వచ్చింది. అధికారం కోసం, పదవి కోసం సొంత బాబాయ్‌నే హత్య చేయించారనే విషయం వెలుగులోకి వచ్చింది. చివరికి వైఎస్ భారతి మేనమామ కొడుకు ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఇప్పుడు నెమ్మదిగా ఉచ్చు బిగుస్తోంది. వివేకా హత్యలో పాల్గొన్న వారికి రూ.40కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని, ఆ ఒప్పందం మొత్తం అవినాష్ అండర్‌లోనే జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అంటే నారాసుర రక్తచరిత్ర అనే వార్త ఫేక్ అని తేలిపోయింది.

Also Read : అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్..!

అయినా సరే.. ఇప్పటికీ సాక్షి మీడియా సంస్థకు నిజాలు సరిగ్గా కనిపిస్తున్నట్లు లేదు. ఎందుకంటే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల తొలి రోజే చిత్తూరు జిల్లా పుంగనూరు రణరంగంగా మారింది. మునిసిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటిరోజే రక్తసిక్తంగా మారింది. ఇందుకు ఎవరు కారణం అంటే.. అక్కడ ఉన్న వాళ్లే కాదు.. అక్కడ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని ఇట్టే చెప్పేస్తారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై మిథున్ రెడ్డి కాన్వాయ్‌ వాహనాలు దూసుకెళ్లాయి. దీంతో ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు.. మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. కాన్వాయ్ వాహనాలు ధ్వంసం అయ్యాయి.

Sakshi Fake Propaganda

అంతే.. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.. ఎప్పుడు రచ్చ చేద్దామా.. అని గోతికాడ నక్క మాదిరిగా ఎదురు చూస్తున్న సాక్షి మీడియా.. ఒక్కసారిగా తన వికృత జర్నలిజానికి తెర లేపింది. మిథున్ రెడ్డి పైన టీడీపీ గూండాల దాడి.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. పాపం మిథున్ రెడ్డి.. అంటూ పోలో మని వరుస కథనాలతో షో రన్ చేసింది. అయితే.. ఈ డ్రామా అంతా ఫేక్ అని కాసేపటికే తేలిపోయింది. మిథున్ రెడ్డి కాన్వాయ్ చేసిన దాడి వీడియో వెలుగులోకి రావడంతో.. ప్రజలకు అసలు నిజం తెలిసిపోయింది. అయితే.. సాక్షి మీడియా మాత్రం.. మళ్లీ మళ్లీ అదే పాత ఫేక్ డ్రామాను రక్తికట్టించేందుకు నానా పాట్లు పడుతుంది. అప్పుడు నారాసుర రక్తచరిత్ర అంటూ హెడ్డింగ్ పెట్టిన సాక్షి.. ఇప్పుడు తెగబడ్డ నారా గొడ్డలి.. అంటూ మరో ఫేక్ స్టోరీతో జనాలను వెర్రోళ్లను చేసేందుకు రెడీ అయ్యింది.

Also Read : అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్..!

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలోనే 150 రాజకీయ హత్యలు జరిగాయని.. ఇదంతా నారా వారి రౌడీ మూక అంటూ ఓ ముఖ్యమంత్రి ఇంటి పేరును బద్నాం చేస్తోంది వైసీపీ అధికార మీడియా. నారా వారు గొడ్డలికి పదును పెట్టారంటూ నోటికి వచ్చినట్లు వాగుతున్నారు. “నారా వారి గొడ్డలి.. నడిరోడ్డు మీద.. పట్టపగలు పిచ్చికుక్కలా స్వైర విహారం చేస్తోంది.” అంటూ ఇష్టం వచ్చినట్లు వాగుతున్న సాక్షి మీడియా పైన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల సూటి ప్రశ్న. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా పైన ఎందుకు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పరువు నష్టం దావా వేయటం లేదని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ పెద్దలు సాక్షిపై న్యాయపరమైన చర్యలు తీసుకోకపోతే.. ఈ అబద్ధాలు, తప్పుడు వార్తల పర్వం తారాస్థాయికి చేరడం ఖాయం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అప్పుడు.. ఇప్పుడు.. మార్పు...

"అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. అప్పుడు...

తిరుపతిలో హైటెన్షన్.. రెచ్చిపోయిన...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల...

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

కూటమి సీట్ల పంపకం...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార...

వైసీపీకి షాక్.. నా...

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్...

పోల్స్