Saturday, October 17, 2026 06:40 AM
Saturday, October 17, 2026 06:40 AM

ఈరోజు రాశి ఫలితాలు (17-10-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం.. 17-10-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బందు వర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
—————————————

వృషభం

అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
—————————————

మిధునం

అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
—————————————

కర్కాటకం

ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
—————————————

సింహం

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
—————————————

కన్య

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఋణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
—————————————

తుల

పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.
—————————————

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
—————————————

ధనస్సు

బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.
—————————————

మకరం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
—————————————

కుంభం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
—————————————

మీనం

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

నాడు ‘రక్తచరిత్ర’.. నేడు...

నారాసుర రక్త చరిత్ర.. ఈ పేరు...

అప్పుడు.. ఇప్పుడు.. మార్పు...

"అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. అప్పుడు...

తిరుపతిలో హైటెన్షన్.. రెచ్చిపోయిన...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల...

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

కూటమి సీట్ల పంపకం...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార...

పోల్స్