Friday, October 16, 2026 05:02 PM
Friday, October 16, 2026 05:02 PM

అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. కారణం..?

“అప్పుడు.. ఇప్పుడు.. మార్పు రాలేదు.. అప్పుడు వాళ్లే కొట్టారు.. ఇప్పుడు కూడా వాళ్లే కొడుతున్నారు.. ఏంది సామీ మాకీ బాధ..” ఇదే రాయలసీమ వాసుల మాట. నిజమే.. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వాళ్లు చేయని అరాచకం అంటూ లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు.. చివరికి పసుపు జెండా కనిపించినా సరే.. దాడి చేసి మరీ చింపేసిన పరిస్థితి. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. ఎక్కడో శ్రీకాకుళం నుంచి తిరుపతికి సైకిల్ మీద వాళ్ల మానాన వాళ్లు పోతుంటే.. వాళ్లు పసుపు చొక్కా వేసుకున్నారని.. పసుపు జెండా వేసుకున్నారని.. వారిని ఆపి.. చొక్కా విప్పించి.. బూతులు తిట్టి మరీ పంపేశారు. పైగా.. మల్లా ఈడ అగుపిస్తే.. సావకొడతా నా కొ..కా అంటూ బూతులతో బెదిరించారు కూడా. పైగా ఆ బెదిరింపులను వాళ్లే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎందుకని అడిగితే.. “ఎవురైనా సైకిల్, టీడీపీ అంటే.. వానికి ఇదే గతి పడ్తాది.. జాగ్రత్త..” అంటు వార్నింగ్ ఇచ్చారు.

Also Read : తిరుపతిలో హైటెన్షన్.. రెచ్చిపోయిన భూమన అభినయ్‌రెడ్డి..?

ఇదంతా రెండున్నరేళ్ల క్రితం మాట. 2019 నుంచి 2024 వరకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఒక టెండర్ వేయాలన్నా, ఒక నామినేషన్ వేయాలన్నా.. చివరికి తనకు ఇంటి పట్టా రాలేదని అడిగేందుకు కూడా ధైర్యం రాలేదు. “మా స్థలం కాజేశారు సామీ.. అని ఫిర్యాదు చేయనీకి పోతే.. పోమ్మా.. పెద్ద వచ్చినావు.. ఆ సోటు నీదని రుజువేంది.. కాయితాలున్నాయా..” అంటూ పోలీస్ స్టేషన్‌లోనే బెదిరించిన పరిస్థితి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనియ్యలేదు. దాడి చేశారు, కిడ్నాప్ చేశారు, హత్యాయత్నం చేశారు, బెదిరించారు.. చివరికి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు కూడా చేయించారు. అలా ఆ ఐదేళ్లు అరాచకమే పరమావధి అన్నట్లుగా చిత్తూరు జిల్లా నేతలు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి, భూమన అనుచరులు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధినేత రాష్ట్రం వదిలేసి.. బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. వైసీపీ నేతలంతా వ్యాపారాలు, ఆరోగ్యం సాకుతో పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో ప్రజలంతా హమ్మయ్య అనుకున్నారు. కూటమి సర్కార్ కూడా.. రాయలసీమలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టి.. అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టింది. రాయలసీమలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. కృష్ణా జలాలు కుప్పం చేరుకున్నాయి. దీంతో అన్నదాతలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో మళ్లీ రెచ్చిపోయారు వైసీపీ మూకలు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ తొలిరోజే.. తమ ప్రతాపం చూపించారు.

పుంగనూరులో టీడీపీ నేతలపైకి వాహనాలతో దాడులు చేశారు. వందల మంది కర్ణాటక ప్రాంత గూండాలతో పుంగనూరు వచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.. పుంగనూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కారు పోనిచ్చారు. అడ్డుకునేందుకు యత్నించిన ఇద్దరి పై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. అయినా సరే.. వెనక్కి తగ్గకుండా పుంగనూరు మునిసిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారినే చంపేస్తా అంటూ ఎంపీ మిధున్ రెడ్డి బెదిరించారంటే.. ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. నామినేషన్ కేంద్రంలో.. పోలీసుల ముందే ఓ ఆర్వోను చంపేస్తా అంటూ బెదిరించడం ఏమిటని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : అమెరికా సంచలన వ్యూహం.. ఇరాన్‌పై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్..?

ఇక తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి చేసిన పని చూస్తే.. పాపం పిల్లోడు అంటారేమో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తిరుపతిలో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్పొరేటర్ అభ్యర్థి చేతుల్లోని నామినేషన్ పత్రాలను పోలీసుల ముందే బలవంతంగా లాక్కున్నాడు. ఆ తర్వాత వందల మంది టీడీపీ కార్యకర్తల ముందే.. చంపుతా.. ఏం చేస్తావు.. అంటూ బెదిరించారు. ఇంతగా వైసీపీ నేతలు మొదటి రోజే బరితెగిస్తున్నారంటే.. ఇందుకు కారణాలేమిటని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు భయపడి.. ఇప్పుడు కూడా భయపడుతూ బతకాలా.. అని ఎదిరిస్తున్నారు. ఎంతకాలం ఈ శాంతి మంత్రం జపించాలని పార్టీ పెద్దలను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసిన వారి పైన రెండున్నరేళ్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే.. ఇప్పుడు ఇలా రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరుపతిలో హైటెన్షన్.. రెచ్చిపోయిన...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల...

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

కూటమి సీట్ల పంపకం...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార...

వైసీపీకి షాక్.. నా...

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

పోల్స్