Friday, October 16, 2026 02:03 PM
Friday, October 16, 2026 02:03 PM

అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రావడంతో, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభ్యర్థుల వడపోతపై ప్రత్యేక నిఘా పెట్టారు.

Also Read : కూటమి సీట్ల పంపకం ఖరారు!

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు. ఈసారి అభ్యర్థుల ఎంపిక పాత పద్ధతుల్లో కాకుండా, పూర్తిగా సరికొత్త వ్యూహంతో క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా జరుగుతోంది. గ్రామ, వార్డు, మండల స్థాయిల్లో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించే ప్రక్రియను పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. స్థానికంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నవారికే టికెట్లు కేటాయించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read : వైసీపీకి షాక్.. నా దగ్గర డబ్బుల్లేవ్ అంటున్న బెజవాడ మేయర్..!

ఇందుకోసం ప్రత్యేక ఐవీఆర్ఎస్ సర్వేలు, నిఘా వర్గాల నివేదికలు, జోనల్ కమిటీల నుంచి వచ్చిన డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. కేవలం సిఫార్సుల ఆధారంగా కాకుండా, ప్రజాదరణ, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో, ఇవాళే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కూటమిలోని మూడు పార్టీల మధ్య ఎలాంటి అసంతృప్తులు రాకుండా, క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో గెలుపే ఏకైక ప్రామాణికంగా ఈ లిస్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: సాయికృష్ణ కేసు...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కూటమి సీట్ల పంపకం...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార...

వైసీపీకి షాక్.. నా...

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైఎస్సార్...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1...

జనసేన పోటీ సీట్లపై...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

బెజవాడ పాలిట్రిక్స్.. రాధ...

బెజవాడ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి....

పోల్స్