Friday, October 24, 2025 03:30 PM
Friday, October 24, 2025 03:30 PM
roots

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బొంబాయి హై కోర్ట్ తీర్పు

మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టై జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. ఉపా కేసులు పెట్టగా ఇప్పుడు ఈ కేసులన్నింటినీ నాగపూర్‌ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు పేర్కొన్న ధర్మాసనం అభియోగాలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో సాయిబాబాతో పాటు అరెస్టైన మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.

తీర్పుపై స్టే విధించాలని ప్రాసిక్యూషన్ కోరలేదు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014 లో 90% వైకల్యంతో వీల్ చైర్ కే పరిమితమైన సాయిబాబాను మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టింది. 2017 లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. అప్పటినుంచి సాయిబాబా నాగ్ పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై 2022 అక్టోబర్ లో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించి వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.

తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా… విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుల విడుదలపై స్టే విధించింది. అనంతరం 2023 ఏప్రిల్ లో మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. వారి అప్పీల్ పై మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని రాష్ట్ర హై కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.

ప్రస్తుతం శరీరం క్షీణించడం వల్ల అతను వీల్‌చైర్‌పై ఉంటున్నాడు. నాగపూర్‌లోని సెంట్రల్ జైలులో అతను శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా అరెస్ట్ అయిన నేపథ్యంలో 2014 లో సాయిబాబాను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. దశాబ్ద కాలంగా జైలు జీవితం అనుభవిస్తున్న ప్రొఫ్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించటంపై పౌర హక్కుల సంఘాలు హర్షం వ్యటం చేశాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

పోల్స్