Friday, October 24, 2025 09:46 PM
Friday, October 24, 2025 09:46 PM
roots

స్పీడు పెంచిన రవితేజ.. లైన్‌లో మరో రెండు సినిమాలు

రవితేజ ప్రస్తుతం అమెరికాలో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లో తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పది రోజుల తర్వాతే రవితేజ తిరిగి హైదరాబాద్ రానున్నారు. అయితే వచ్చిన వెంటనే మాస్ మహరాజ మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెకేషన్ కోసం మిస్టర్ బచ్చన్ షూటింగ్‌కి చిన్న బ్రేక్ తీసుకున్నారు రవితేజ.

అనుదీప్‌తోనేనా
ప్రస్తుతం ఇద్దరు యంగర్ డైరెక్టర్స్‌తో రవితేజ చర్చలు జరుపుతున్నారు. అందులో ఒకరు ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ కావడం విశేషం. ఇప్పటికే అనుదీప్.. రవితేజకు స్క్రిప్ట్ మొత్తం చెప్పి ఒకే చేశారని టాక్. ఇక ప్రొడక్షన్ కంపెనీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓకే చేసిన వెంటనే సినిమా అనౌన్స్ చేస్తారట. అలానే మరో కొత్త డైరెక్టర్‌తో కూడా రవితేజ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి కనీసం రెండు లేదా మూడు చిత్రాలను రిలీజ్ చేయాలని రవితేజ ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే గతేడాది వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను రిలీజ్ చేశారు రవితేజ. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. రావణాసుర ఫ్లాప్ కాగా టైగర్ నాగేశ్వరరావు ఫర్వాలేదనిపించింది.

ఇక ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ సినిమాను రిలీజ్ చేశారు రవతేజ. ఇది బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ షూటింగ్‌లో ఉన్న రవి.. ఇది పూర్తయిన వెంటనే కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారట. ఇలా వరుస సినిమాలతో మాస్ మహారాజా మంచి జోరు మీద ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్