Saturday, September 5, 2026 07:03 PM
Saturday, September 5, 2026 07:03 PM

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం, వారి సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరిస్తూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు వెలువరించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నాయకులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ హర్షం ప్రకటించారు.

Also Read : టీవీకే టార్గెట్‌లో డీఎంకే కీలక నేతలు.. చుక్కలు చూపిస్తున్న విజయ్..!

ఈ చర్చల్లో భాగంగా ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో పాటు నిలిచిపోయిన రెండు డీఏలను (1-7-2024 మరియు 1-1-2025 డీఏలు) 2026 అక్టోబర్ 1 వ తేదీ నుంచి చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్స్ నగదును వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి అంగీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే పోలీసు ఉద్యోగులకు ఈ దసరా పండుగ కానుకగా 1 అడిషనల్ సరెండర్ లీవ్ చెల్లింపునకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు.

Also Read : ఏపీ రాజకీయాల్లో బిగ్ షాక్.. రాజకీయాలకు అయ్యన్నపాత్రుడు గుడ్ బై..!

పెన్షనర్లు, హెల్త్ స్కీం లబ్ధిదారులకు సైతం ఈ నిర్ణయాల ద్వారా భారీ ఉపశమనం లభించనుంది. 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను జనవరి 2027 నుంచి అమలు చేయనున్నారు. అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీంను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ, వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల నిధులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కీలక నిర్ణయాల అన్నింటి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతి ఏడాది రూ. 2,880 కోట్ల అదనపు భారం పడనుందని సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్లేట్ తిప్పేసిన రాజగోపాల్...

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొంతకాలంగా...

టీవీకే టార్గెట్‌లో డీఎంకే...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది....

ఏపీ రాజకీయాల్లో బిగ్...

ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు,...

సాయి రెడ్డి పార్టీకి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర...

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పేపర్ మిల్లు మూసేస్తారా.....

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు వెంటనే...

పోల్స్