Saturday, August 29, 2026 06:41 AM
Saturday, August 29, 2026 06:41 AM

ఈరోజు రాశి ఫలితాలు (29-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం.. 29-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. మాతృ సంబంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

—————————————

వృషభం

స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

—————————————

మిధునం

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

—————————————

కర్కాటకం

నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

—————————————

సింహం

నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

—————————————

కన్య

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

—————————————

తుల

వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

—————————————

వృశ్చికం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

—————————————

ధనస్సు

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు.

—————————————

మకరం

వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

—————————————

కుంభం

వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

—————————————

మీనం

బంధువులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు...

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా వచ్చే నెల...

ఇలా అయితే ...

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.....

ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేలా...

సీఎం రేవంత్‌కు మంత్రి...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

పోల్స్