Monday, October 12, 2026 06:16 AM
Monday, October 12, 2026 06:16 AM

హెచ్1ఎన్1 వస్తే హార్ట్ ఎటాక్ వస్తుందా..?

కరోనా వచ్చినప్పటి నుండి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వల్ల గుండె సమస్యలు వస్తాయనే విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే కేవలం కరోనా మాత్రమే కాదు.. తీవ్రమైన ఇన్‌ఫ్లుయెంజా లేదా హెచ్1ఎన్1 వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా హార్ట్ ఎటాక్ మరియు అరిథ్మియా అంటే గుండె లయ తప్పడం వంటి ప్రమాదకరమైన గుండె జబ్బులకు దారితీస్తాయని తాజాగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఊపిరితిత్తులపైనే కాకుండా, అది మొత్తం కార్డియోవాస్కులర్ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వివేక్ టాండన్ స్పష్టం చేశారు.

Also Read : క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్‌కు అవమానకర రికార్డు..!

మెడికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ప్రకారం.. తీవ్రమైన ఫ్లూ లేదా హెచ్1ఎన్1 ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన మొదటి కొన్ని రోజుల్లోనే రోగులలో హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు దాదాపు ఆరు రెట్లు పెరుగుతుందని తేలింది. ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, తీవ్రమైన జ్వరం కారణంగా డీహైడ్రేషన్ మరియు బాడీలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల గుండె యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయి గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా మారుతుంది.

Also Read : స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ ఎడిషన్ లాంచ్.. అదిరిపోయే లుక్స్..!

ఇది కాస్తా గుండెపోటుకు లేదా గుండె తాత్కాలికంగా బలహీనపడే ‘సెప్సిస్ ఇండ్యూస్డ్ కార్డియాక్ డిస్ఫంక్షన్’కు దారితీస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ, షుగర్ ఉన్న రోగులు మరియు వృద్ధులు ఈ రకమైన ఇన్ఫెక్షన్ల బారిన పడితే గుండె సమస్యలు వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్లూ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వచ్చే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసటను కేవలం సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు చెబుతున్నారు. గుండెల్లో విపరీతమైన నొప్పి లేదా ఒత్తిడి, అకస్మాత్తుగా కళ్ళు తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే గుండె జబ్బులు ఉన్నవారు ముందస్తుగా ‘ఫ్లూ వ్యాక్సినేషన్’ తీసుకోవడం వల్ల ఇటువంటి గుండెపోటు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్