భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘స్కోడా ఆటో ఇండియా’ సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్ కైలాక్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ ‘స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్’ ట్రిమ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కైలాక్ లైనప్‌లో ఇది ఏడవ వేరియంట్‌గా రానుంది. సరికొత్త కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో, స్పోర్టీ లుక్‌తో డిజైన్ చేసిన ఈ కారు ప్రారంభ ధరను ఎక్స్-షోరూమ్ వద్ద ₹11.32 లక్షలుగా నిర్ణయించగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర ₹12.32 లక్షల వరకు ఉంది.
Also Read : గ్రూప్-1 స్కామ్.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్!
ఈ స్పోర్ట్‌లైన్ ఎడిషన్ సాధారణ కైలాక్ మోడల్స్ కంటే భిన్నమైన, పవర్‌ఫుల్ విజువల్ ఐడెంటిటీని కలిగి ఉంది. స్కోడా బ్రాండ్ యొక్క మోటార్ స్పోర్ట్ జేనేరషన్ కు ప్రతీకగా దీని ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్‌లో ప్రత్యేకమైన బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించారు. కారు వెలుపలి భాగంలో డీప్ బ్లాక్ ఓఆర్‌విఎంలు, గ్లోస్ బ్లాక్ ఫ్రంట్ మరియు రియర్ డిఫ్యూజర్లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన 17-ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు టైల్‌గేట్‌పై బ్లాక్ కలర్ స్కోడా బాడ్జింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Also Read : ప్రత్యక్ష ఎన్నిక.. చంద్రబాబు వ్యూహం అదే..!
ఇంటీరియర్ విషయానికి వస్తే.. డార్క్ థీమ్‌తో కూడిన క్యాబిన్, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కూడిన లెదరెట్ సీట్లు, అల్యూమినియం పెడల్స్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 25.6 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ఇంజన్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. ఈ కారులో స్కోడా యొక్క నమ్మకమైన 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 115 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తూ ప్రయాణంలో అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. కస్టమర్ల సౌకర్యార్థం ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా, మరింత స్పోర్టీ క్యారెక్టర్‌తో వచ్చిన ఈ సరికొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్

