Thursday, August 20, 2026 05:37 PM
Thursday, August 20, 2026 05:37 PM

ఈరోజు రాశి ఫలితాలు (20-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్ల పక్షం.. 20-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

—————————————

వృషభం

సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు.

—————————————

మిధునం

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలు అనుకూలిస్తాయి.

—————————————

కర్కాటకం

చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది.

—————————————

కన్య

నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఉన్న ఆటంకాలు తొలగి, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

—————————————

తుల

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

—————————————

వృశ్చికం

వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

—————————————

ధనస్సు

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

—————————————

మకరం

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

—————————————

కుంభం

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి.

—————————————

మీనం

చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో అంతర్గతంగా అసహనం.....

కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య విభేదాలు...

హైదరాబాద్ టార్గెట్‌గా పాక్...

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో...

గ్రూప్-1 అక్రమాలు.. వైసీపీ...

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపిస్తే...

పరిశ్రమల్లో పచ్చని విప్లవం.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు...

భారత్ ఘన విజయం.....

గాలే అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో జరిగిన...

టాలీవుడ్ కు షాక్...

తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్...

పోల్స్