Tuesday, August 18, 2026 08:30 PM
Tuesday, August 18, 2026 08:30 PM

శరీరంలో దాగున్న పాత వైరస్‌లను కరోనా నిద్రలేపుతోందా..?

కరోనావైరస్ సోకినప్పుడు అది కేవలం రోగనిరోధక శక్తితోనే పోరాడదని, శరీరంలో ఎప్పటి నుంచో నిగూఢంగా దాగున్న ఇతర ప్రమాదకరమైన పాత వైరస్‌లను సైతం తిరిగి నిద్రలేపుతుందని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘నేచర్’ లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. కోవిడ్-19 వల్ల శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, మనకు తెలియకుండానే దేహంలో దాక్కున్న పాత వైరస్‌లు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also Read : బీసీలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!

అమెరికాలోని 20 ఆసుపత్రులలో చేరిన 1,154 మంది కోవిడ్ రోగుల డేటాను పరిశీలించగా, దాదాపు 47.9 శాతం మందిలో కనీసం ఒక పాత వైరస్ అయినా తిరిగి యాక్టివ్ అయినట్లు ఆధారాలు లభించాయి. ఈ పరిశోధనలో మానవ శరీరంలో సుదీర్ఘకాలం నిద్రాణంగా ఉండే ఎప్‌స్టీన్-బార్ వైరస్, సైటోమెగాలోవైరస్, పెదవులపై పుండ్లు కలిగించే హెర్పెస్ సింప్లెక్స్ వైరస్-1తో పాటు ‘అనెల్లోవిరిడే’ కుటుంబానికి చెందిన వైరస్‌లు కోవిడ్ సోకిన రోగులలో మళ్లీ చురుగ్గా మారినట్లు కనుగొన్నారు.

Also Read : భారత ధనికులు విదేశాల్లోనే సెటిల్ అవుతారా..?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తీవ్రమైన రోగనిరోధక లోపాలు లేని సాధారణ వ్యక్తులలో కూడా ఈ వైరస్‌లు తిరిగి మేల్కొనడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది. కోవిడ్ సోకిన ప్రారంభ దశలోనే ఎప్‌స్టీన్-బార్ వైరస్ బయటపడగా, హెర్పెస్ మరియు సీఎంవీ వైరస్‌లు వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత ఆలస్యంగా యాక్టివ్ అవుతున్నట్లు పరిశోధకులు గమనించారు. శరీరంలో ఈ పాత వైరస్‌లు తిరిగి మేల్కొనడం వల్ల కోవిడ్ తీవ్రత మరింత పెరగడమే కాకుండా, చాలా కాలం పాటు పీడించే ‘లాంగ్ కోవిడ్’ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా ఇది దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ వైరస్‌ల వల్లే కోవిడ్ తీవ్రంగా మారుతోందని ఖచ్చితంగా చెప్పలేమని, కానీ వీటి మధ్య బలమైన లింక్ ఉందనే విషయాన్ని మాత్రం కొట్టిపారేయలేమని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్త డాక్టర్ ఓఫర్ లెవీ స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్