Tuesday, October 21, 2025 07:00 PM
Tuesday, October 21, 2025 07:00 PM
roots

గుండె వైఫల్యం లక్షణాలు ఇవే.. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి..?

“గుండెపోటు, గుండె సమస్యలు” ఈ రోజుల్లో ఎక్కువగా వినపడుతున్న మాటలు. కరోనా తర్వాత మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదనే విషయం చాలా మందికి క్లారిటీ వచ్చింది. వస్తువుల గ్యారెంటీ కోసం పోరాడే మనుషులు తమ గుండెకు గ్యారెంటి లేదనే అవగాహనకు వచ్చి జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఇక గుండె విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రులకు వెళ్ళే వారి సంఖ్య కూడా కాస్త ఎక్కువే మరి. ఇదే సమయంలో గుండెకు సంబంధించి స్వీయ అవగాహన కూడా పెంచుకోవాల్సి ఉంటుంది.

Also Read : చికెన్ కడిగితే వచ్చే రోగాలు ఇవే.. కడగపోవడమే మంచిదా..?

తాజాగా ఓ డాక్టర్ గుండెకు సంబంధించి కీలక సూచనలు చేసారు. అసలు గుండె వైఫల్యం అంటే చాలా మందికి అవగాహన లేదు. గుండె వైఫల్యం అంటే గుండె రక్తాన్ని పంప్ చేయాల్సినంత బాగా పంప్ చేయడం లేదని అంటూ సదరు డాక్టర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీని అర్థం గుండె ఆగిపోయిందని కాదు, కానీ శరీర అవసరాలను తీర్చడానికి అది ఇబ్బంది పడుతోందని అని డాక్టర్ యారనోవ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అసలు సాధారణ లక్షణాలు ఏంటో చూద్దాం.

రోజువారీ కార్యకలాపాల సమయంలో, లేదంటే పడుకున్న సమయంలో శ్వాస ఆడకపోవడం, అలాగే నిరంతరం అలసటగా అనిపించడం వంటివి ప్రమాదకరం. ఇక కాళ్ళు, చీలమండలు లేదా పాదాలలో వాపు వస్తే మాత్రం దాన్ని లైట్ తీసుకోవద్దు అని సూచిస్తున్నారు. గుండె వేగంగా కొట్టుకున్నా, సాధారణం కంటే స్పందనలో మార్పులు ఉన్నా సరే జాగ్రత్త పడాల్సిందే. నిరంతర దగ్గు లేదా గురక ఎక్కువగా ఉన్నా సరే జాగ్రత్త పడాల్సిందే. గుండె వైఫల్యం అనేది ఎవరికి అయినా ప్రమాదమే. వయసుతో సంబంధం లేదు.

Also Read : ప్రాణాలు కోల్పోయిన యువ క్రికెటర్లు..!

అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, డయాబెటిస్, ఊబకాయం, ధూమపానం, అతిగా మద్యం సేవించడం వంటివి ప్రమాదకరమని డాక్టర్ హెచ్చరించారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ఒకసారి చూస్తే.. బరువు తగ్గడం అనేది అత్యంత కీలకం. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే పొగాకు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తన సోషల్ మీడియా పోస్ట్ లో హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్