ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది. నాణ్యమైన మద్యం తయారు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్న ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన నాణ్యమైన మద్యం హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు తాజాగా దేశంలోనే తొలిసారిగా సంచలన నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు సర్కార్. నకిలీ మద్యం నివారణకు మరిన్ని చర్యలు చేపట్టిన ప్రభుత్వం సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Also Read : వాళ్ళు ఇద్దరూ జట్టులోనే ఉంటారు.. బోర్డు క్లారిటీ..!
నకిలీ మద్యం నివారణకు నిబంధనలు ఎక్సైజ్ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. ఇకపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మేలా నిబంధన.. ‘ఎక్సైజ్ సురక్షా యాప్’ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలని నిబంధన విధించింది. ప్రతి దుకాణం, బార్ వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు బోర్డులు పెట్టాలని నిబంధన తెచ్చింది. మద్యం సీసాపై సీల్, క్యాప్, హోలోగ్రామ్, ప్రామాణికత తనిఖీ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి దుకాణం, బార్‌లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని తమ ఆదేశాల్లో పేర్కొంది.
Also Read : జోగిని సస్పెండ్ చేస్తారా..? వివాదాల ఆప్తుడు..!
ఎక్సైజ్ సిబ్బంది రోజూ మద్యం దుకాణాల్లో ర్యాండమ్ గా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల వివరాలు దుకాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. డిపో నుంచి మద్యం అందాక, కనీసం 5 శాతం సీసాలు స్కాన్ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. తనిఖీల్లో నకిలీ మద్యం గుర్తిస్తే, ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. నకిలీ మద్యం దొరికితే.. లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. నకిలీ మద్యంపై ఫిర్యాదులకు పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని తెలిపింది. ఫిర్యాదులను 24 గంటల్లో విచారించి నివేదించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ఏపీలో కల్తీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.