Sunday, October 19, 2025 12:39 PM
Sunday, October 19, 2025 12:39 PM
roots

నాకు ఈ పదవి వద్దు సార్..!

కేంద్ర మంత్రి అంటే.. అంతా అబ్బా.. ఇంకేముంది.. చేతి నిండా కావాల్సినంత సంపాదన.. చుట్టూ మందీ మార్బలం.. హోదా.. దర్పం.. ఇంతకంటే ఏం కావాలి. అయితే ఇదంతా రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. రాజకీయాలు చేసే వారికే ఇవన్నీ.. అసలు రాజకీయాలతో సంబంధం లేని వారికి ఇవన్నీ కాస్త ఇబ్బంది పెడతాయనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. మంత్రి పదవి అంటే కొందరికి అది అలంకారమే తప్ప.. ఆదాయం కాదనే మాట బాగా వినిపిస్తోంది. మరి కొందరైతే.. మాకు ఈ పదవులు వద్దు బాబోయ్ అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో హీరో సురేశ్ గోపీ కూడా చేరిపోయారు.

Also Read : యువతకు ఏం కావాలో తేల్చేసిన పవన్..!

కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్రం నుంచి అనూహ్యంగా ఎంపీగా ఎన్నికయ్యారు సురేశ్ గోపీ. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో త్రిస్సూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సురేశ్ గోపీ.. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై ఏకంగా 74 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ తరఫున కేరళా నుంచి గెలిచిన తొలి ఎంపీగా కూడా సురేశ్ గోపీ రికార్డు సృష్టించారు. దీంతో సురేశ్‌ను కేంద్ర మంత్రిని చేసిన మోదీ.. కీలకమైన పెట్రోలియం శాఖ సహయ మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇప్పటి వరకు సురేశ్ గోపీ పైన ఒక్క ఆరోపణ కూడా రాలేదు. సురేశ్ గోపీ ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నారనేది కేరళలో వినిపిస్తున్న మాట.

అయితే ఇటీవల సురేశ్ గోపీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తున్నట్లు సురేశ్ గోపీ ప్రకటించారు. ఇందుకు ప్రధానంగా తన ఆర్థిక పరిస్థితి కారణమంటున్నారు. అసలు సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోవాలేదన్నారు. ఇటీవల తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో సురేశ్ గోపీ వ్యాఖ్యానించారు. డబ్బుల కోసం మళ్లీ నటించాలని భావిస్తున్నట్లు సురేశ్ గోపీ అన్నారు. అయితే నటించాలంటే అందుకు పదవి అడ్డువస్తుందని.. అందుకే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సురేశ్ గోపీ ప్రకటించారు. తన మంత్రిపదవిని కేరళకే చెందిన రాజ్యసభ సభ్యులు సదానందన్‌కు ఇవ్వాలని కూడా గోపీ కోరారు.

Also Read : చంద్రబాబును తిట్టినా చలనం లేదా..? ఎందుకీ మౌనం..?

ఇదే విషయంపై ఏపీలో కూడా చర్చ నడుస్తోంది. సురేశ్ గోపీతో పాటు పవన్ కల్యాణ్ కూడా తొలిసారి డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా తన ఆదాయం కోసమే సినిమాలు చేస్తున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు కూడా. తనకు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే పార్టీని నడుపుతున్నట్లు పవన్ గతంలోనే వ్యాఖ్యానించారు. డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలి కదా అని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేస్తున్నప్పుడు.. తాను నటిస్తే తప్పేంటి అనేది పవన్ అభిమానుల ప్రశ్న. దీంతో నిజాయతీగా ఉండే వారు రాజకీయాల్లో రాణించే పరిస్థితి లేదనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్