Sunday, October 19, 2025 01:23 PM
Sunday, October 19, 2025 01:23 PM
roots

లిమిట్స్ లో ఉండండి.. పాక్ కు ఆఫ్ఘన్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ముందు నుంచి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ కాస్త కక్ష సాధింపుగా వ్యవహరిస్తోండగా.. తాజాగా ఆఫ్ఘన్ లో దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో పాక్ సైన్యానికి ఆఫ్ఘన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో 50 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించగా, 19 ఆఫ్ఘన్ సరిహద్దు పోస్టులను పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది. ఈ తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఆదివారం పాకిస్తాన్‌ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : బాలయ్య ఫ్యాన్స్ కు తమన్ అదిరిపోయే గిఫ్ట్.. బాక్సులు బద్దలే..!

ముత్తాకి మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్‌ కు పౌరులతో ఎలాంటి సమస్యలు లేవని, కానీ “పాకిస్తాన్‌ లోని కొన్ని అంశాలు ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయని అన్నారు. తాము శాంతి కోరుకోకపోతే ఏం చేయాలో కూడా తమకు ఓ ప్రణాళిక ఉందని, పాకిస్తాన్ తన పరిధిలో తాను ఉంటే అందరికి మేలు చేస్తుందని హెచ్చరించారు. గురువారం పాకిస్తాన్ వైమానిక బలగాలు, ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ పై దాడులకు దిగాయి. ఈ దాడులపై అమీర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతరం రెండు దేశాల మధ్య సరిహద్దులను మూసివేసారు.

Also Read :తెలంగాణలో ఆగని మంత్రుల వార్

అర్ధరాత్రి సమయంలో తమ సరిహద్దులపై పాకిస్తాన్ దాడులకు పాల్పడిందని, తాము అదే స్థాయిలో స్పందించి 58 మంది పాకిస్తాన్ సైనికులను కాల్చి చంపామని పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం, 23 మందిని మాత్రమే ఆఫ్ఘన్ హతమార్చినట్టు తెలిపింది. మెజారిటీ పాకిస్తాన్ ప్రజలు, శాంతిని ఇష్టపడేవారు, ఆఫ్ఘనిస్తాన్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నారని అమీర్ ఖాన్ వెల్లడించారు. తమకు పాకిస్తాన్ పౌరులతో ఏ విధమైన సమస్యలు లేవని, కాని పాక్ సైన్యం కవ్విస్తోందని మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్