Sunday, October 19, 2025 08:07 AM
Sunday, October 19, 2025 08:07 AM
roots

కల్తీ మద్యం విషయంలో కూటమి నాయకులు బోల్తా..? మద్దతు ఎక్కడ..?

ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారగా, ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. నకిలీ మద్యం ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారడంతో సిఎం చంద్రబాబు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసారు. ఇక నేరస్తుల విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తామని, కల్తీ మద్యం వ్యవహారాన్ని అంత తేలికగా తీసుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు సిఎం చంద్రబాబు.

Also Read : యువతకు ఏం కావాలో తేల్చేసిన పవన్..!

అయితే కల్తీ మద్యం వ్యవహారంలో వైసీపీ ఆరోపణలను టీడీపీ ఖండించడంలో విఫలమవుతోందనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారు చేస్తారనే పక్కా ఆధారాలు ఉన్నా సరే పోలీసులు మాత్రం ఏ విధమైన చర్యలకు అప్పట్లో దిగలేదు. అటు ప్రభుత్వ పెద్దలు కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా తమ నాయకత్వానికి సహకరించిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయంలో నేరుగా సిఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, ఘాటు వ్యాఖ్యలు చేసారు.

Also Read : తెలంగాణలో ఆగని మంత్రుల వార్

ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సైతం ఏర్పాటు చేసారు సిఎం. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచలన విషయాలు బయట పెట్టారు. 2021 నుంచే ఈ కల్తీ మద్యం వ్యాపారం సాగుతోందని, హైదరాబాద్ నుంచి విజయవాడకు నకిలీ మద్యం వచ్చేదని, బార్ లు, వైన్ షాపులకు ఈ మద్యం తరలించేవారని గుర్తించారు. పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మరీ.. కల్తీ లిక్కర్ మాఫియాను వెంటాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి విజయమే అయినా.. కూటమి నుంచి స్పందన కరువైంది. జనసేన, బిజెపి నేతలు సైతం వైసీపీ కౌంటర్ లకు సమాధానం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్