Sunday, October 19, 2025 09:14 PM
Sunday, October 19, 2025 09:14 PM
roots

రైలులో రచ్చ.. మరోసారి హక్కుల గోల..!

భారత రాజ్యాంగం జనవరి 26, 1950 న అమలులోకి వచ్చింది. ఈ రోజును దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం.. రిపబ్లిక్ డేగా జరుపుకుంటారు. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించడమే భారత రాజ్యాంగ ప్రధమ కర్తవ్యం. అయితే కొందరు మాత్రం రాజ్యాంగం కల్పించిన హక్కులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు. ఏమైనా అంటే కులం, మతం కార్డు తీస్తున్నారు. మరి కొందరు అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారంటూ ఎదుటి వారిపై దాడికి కూడా పాల్పడుతున్నారు. తప్పుడు ఆరోపణలతో కేసులు పెడుతున్నారు.

Also Read : కేసీఆర్‌కు మాజీ మంత్రి షాక్..!

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బీహార్‌లో చోటు చేసుకుంది. అయితే ఈ కేసులో తప్పు చేసిన వ్యక్తికి న్యాయ వ్యవస్థ చిన్న జరిమానా, మందలింపుతో సరిపెట్టింది. బీహార్‌ అంటేనే ప్రతి ఒక్కరికీ భయం. అక్కడి వారి పట్ల కాస్త జాగ్రత్తగానే ఉంటారు. ఇక బీహారీలు రైలులో ప్రయాణం చేస్తున్నారంటే. ఇంకా జాగ్రత్తగా ఉంటారు. బీహార్‌లో ఓ మహిళా ఉపాధ్యాయని సీజన్ పాస్‌‌కో ఏకంగా ఏసీ రైలు ఎక్కేసింది. దర్జాగా ఓ బెర్త్‌లో కూర్చుని ప్రయాణం చేస్తున్న సమయంలో టికెట్ చూపించాలని టీటీఈ ఆమెను అడిగారు. అంతే.. అదేదో తప్పు చేసినట్లుగా అతని పట్ల దురుసుగా ప్రవర్తించారు సదరు టీచర్ గారు. అయితే ఈ వ్యవహారం మొత్తం సదు టీటీఈ తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశారు. టీచర్ తిట్టిన తిట్లు, దాడికి యత్నించడం.. నీ సంగతి తేలుస్తా అని వార్నింగ్ ఇవ్వడం కూడా వీడియోలో రికార్డ్ చేశారు. వీడియో ఎందుకు తీస్తున్నావంటూ ఆ టీటీఈపై దాడి కూడా చేశారు ఆ మహిళ.

తర్వాత స్టేషన్‌లో తన బంధువులతో కలిసి టీటీఈపై దాడికి యత్నించారు మహిళ. ఇక్కడే ఆమె ఓ బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ముందుగా ఆ టీటీఈ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అయితే తాను అలా చేయలేదని.. కావాలంటే వీడియో చూసుకోవాలంటూ టీటీఈ రుజువు చూపించడంతో.. కొత్త డ్రామాకు తెర లేపారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలు, వీడియో తీశారని.. వాటిని సోషల్ మీడియా పెట్టి తన పరువుకు భంగం కలిగించేందుకు చూసారని నాటకం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ మహిళ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టికెట్ లేకుండా ఏకంగా ఏసీ బోగిలో ప్రయాణం చేసిందే కాకుండా.. ఇలా టీటీఈ పై దాడికి యత్నిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : కెప్టెన్ పదవి పై సమాచారం ఉంది.. గిల్ కామెంట్స్..!

ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు రైల్వే కోర్టు వెయ్యి రూపాయలు జరిమానా విధించింది. అయితే ఇలా ఆ మహిళ ఉద్యోగి జరిమానా కట్టడం ఇది మూడోసారి అని విచారణలో తేలింది. గతంలో రెండు సార్లు ఇలా టికెట్ లేకుండా ప్రయాణం చేసి పట్టుబడినా కూడా.. ఆమె ఇప్పటికీ ఏ మాత్రం భయపడకుండా మళ్లీ మళ్లీ అదే మాదిరిగా టికెట్ లేకుండా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. దీంతో మన చట్టాల్లో ఇన్ని లోసుగులు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. వీడియోలు, ఫోటోలు లేకపోతే.. ఆ యువ టీటీఈ పరిస్థితి ఏమిటని భయపడుతున్నారు. మహిళ చెప్పిన మాటలు నమ్మి.. ఆ టీటీఈపై కేసు నమోదు చేస్తే.. అతని ఉద్యోగం పోయే ప్రమాదం కూడా ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్