ఆసియాలో ఉన్న ముస్లిం దేశాల్లో భారత్ విషయంలో సన్నిహితంగా ఉండే దేశం ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు కూడా భారత విషయంలో ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ దేశ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. నేడు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ ఆగ్ర జట్లను కూడా ఓడించే స్థాయికి వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా మన బోర్డు పుణ్యమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఎందరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఆఫ్గనిస్తాన్ విషయంలో కూడా ముందు నుంచి సహాయ సహకారాలు అందిస్తూ వస్తోంది భారత ప్రభుత్వం.
Also Read : మిథున్ రెడ్డి లిక్కర్ కేసు మూలనపడినట్లేనా..?
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు వైద్య సహాయం, ఆహారం అలాగే నిధులను అందిస్తోంది. దీనితో అక్కడ ప్రజలు కూడా భారత్ విషయంలో ఎంతో సానుకూలంగా ఉంటారు. ఈ విషయం తాజాగా మరోసారి రుజువు అయింది. బైక్ పై ఆఫ్ఘనిస్తాన్ వెళుతున్న ఇండియన్ యూట్యూబ్ ట్రావెలర్ ఒకరు ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో అడుగుపెట్టేముందు అక్కడి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు చెకింగ్ చేశారు. ఈ సందర్భంగా పాస్పోర్ట్ చూపించాలంటూ అక్కడ సైనికుడు యూట్యూబర్ ను అడిగాడు.
Also Read : మద్యం వద్దు.. ఏపీ మందు బాబులకు నిపుణుల వార్నింగ్
ఎక్కడి నుంచి వస్తున్నావ్ అని ప్రశ్నించగా తాను ఇండియా నుంచి చూస్తున్నానని.. సమాధానం ఇవ్వటంతో పాస్పోర్ట్ కూడా అడగలేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ – ఇండియా బ్రదర్స్ అంటూ కామెంట్ చేశాడు. అలాగే కాబూల్ లో అడుగుపెడుతున్నందుకు స్వాగతం కూడా పలికాడు. ఈ సందర్భంగా చాయ్ తాగుదాం అంటూ ఆహ్వానించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ప్రభుత్వం మారినా సరే.. తాలిబాన్లు పరిపాలిస్తున్న సరే భారత్ విషయంలో వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ మర్చిపోలేనిదని పలువురు కామెంట్ చేస్తున్నారు. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తమను భారత్ గుర్తించాలని తాలిబాన్లు కోరారు. తాము భారత్ తో స్నేహం కోసం ఎదురుచూస్తున్నామని కూడా అప్పట్లో తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది.