Thursday, October 1, 2026 08:28 PM
Thursday, October 1, 2026 08:28 PM

నందమూరి బాలకృష్ణ వారసురాలిగా…!

నందమూరి కుటుంబం.. తెలుసు సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఫ్యామిలీ. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావుతో మొదలైన నందమూరి సినీ ప్రయాణం 4 తరాలుగా కొనసాగుతూనే ఉంది. ఎన్‌టీఆర్ నట వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ వెండితెరపై అభిమానులను అలరించారు. ఇక మూడో తరంలో తారక్, కళ్యామ్ రామ్, తారక రత్న వంటి నటులు.. అభిమానులను మెప్పించారు. వీరితో పాటు ఎన్టీఆర్ పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరి మనవడు కూడా ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించారు. దీంతో రామారావు కుటుంబంలో నాలుగో తరం కూడా సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చినట్లు అయ్యింది.

Also Read : డిజిటల్ బుక్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ రంగంలో అయినా సరే.. ఆయనే రాజుగా కొనసాగారు. సినీ ప్రయాణంలో అగ్ర హీరోగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి.. రికార్డు సృష్టించారు. ఇక ఆయన సినీ వారసులుగా వచ్చిన నందమూరి బాలకృష్ణ.. 50 ఏళ్లుగా వెండితెరపై విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ బాలయ్యకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక నందమూరి తారక రామారావు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగారు. ఇక త్వరలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా వెండితెరపై తన అదృష్టాన్ని పరిక్షీంచుకోనున్నారు.

Also Read : కల్తీ మద్యంపై యుద్ధమే.. బెజవాడలో వైసీపీ సైలెంట్ విచారణ

అయితే నందమూరి కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా కెమెరా ముందుకు రాలేదు. అక్కినేని కుటుంబం నుంచి కోడలు అమల, మనవరాలు సుప్రియ సినిమాల్లో నటించారు. కృష్ణ కుమార్తె మంజుల కూడా చాలా సినిమాల్లో కనిపించారు. మహేష్ బాబు కుమార్తె సితార కూడా టీవీ యాడ్స్‌ చేస్తోంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె నిహారిక సినిమాల్లో వెబ్ సిరీస్‌లలో, బుల్లి తెరపై కూడా కనిపించారు. కానీ నందమూరి ఫ్యామలీ నుంచి మహిళల్లో ఒక్కరు కూడా కెమెరా ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఆ రికార్డును చెరిపేశారు బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని. తొలిసారిగా తేజస్విని కెమెరా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా తేజస్విని ప్రచారం చేస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన సంస్థ.. త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీంతో నందమూరి కుటుంబంలో కెమెరా ముందుకు వచ్చిన తొలి మహిళగా తేజస్వినిని అభివర్ణిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

పోల్స్