Sunday, October 19, 2025 08:18 PM
Sunday, October 19, 2025 08:18 PM
roots

కూటమి.. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం..!

ఇది మంచి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు చెబుతున్న మాట ఇదే. ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాం.. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామని చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పదే పదే చెప్పిన మాట. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని అధినేత పూర్తిగా విస్మరించారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో పెత్తనం చేసిన వారికే మళ్లీ మళ్లీ పదవులు దక్కుతున్నాయని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు సహా కిందిస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడిన వారే. కొంతమంది హత్యకు గురైతే.. కొందరు అక్రమ కేసులకు బయపడి ఊర్లు వదిలి పారిపోయారు. మరికొందరు అయితే రోజుల తరబడి జైళ్లల్లో మగ్గారు. ఇక రౌడీ షీటర్‌ ముద్రతో బైండోవర్ కేసులున్న వారి సంగతి అయితే లెక్క లేదు. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే.. నీ మీద రౌడీ షీట్ ఉంది.. స్టేషన్‌కు రా.. అని పిలుపు వస్తుంది. వెళ్లిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరింపులు. వీటికి తోడు ఆస్తులు నష్టపోయిన వారు కూడా ఉన్నారు.

Also Read : స్పిరిట్ విలన్ అతనే.. సందీప్ రెడ్డి సేఫ్ సెలెక్షన్

నెలల తరబడి కుటుంబాలకు దూరమైన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వారి గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఎన్నో హామీలిచ్చారు. యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో “అన్న.. మా మీద కేసులున్నాయి.. మా ఇంటాయనా ఇప్పటికీ జైలులో ఉన్నారంటూ..” వందల మంది లోకేష్‌కు స్వయంగా మొరపెట్టుకున్నారు. ఇలాంటి వారికి నేనున్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని తప్పుడు కేసులు మాఫీ చేస్తా.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను ఆదుకుంటా అని హామీల వర్షం కురిపించారు మంత్రి నారా లోకేష్.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు అధినేత చంద్రబాబు కూడా స్వయంగా హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు. ఇక పార్టీ గెలిచిన తర్వాత తమకు తప్పకుండా పదవి వస్తుందని తమ నేతలు హామీ ఇవ్వడంతో.. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఆశతో ఎదురు చూశారు. కార్పొరేషన్ చైర్మన్ స్థాయి నుంచి.. డైరెక్టర్లు, దేవస్థానం పాలకమండలి సభ్యుల వరకు ఇది నీకే అని కొంతమందికి నేతలు హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి.. కార్యకర్తలతో పాటు నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : జూబ్లీహిల్స్ అభ్యర్థి ఆయనే..? ఫైనల్ చేసిన కాంగ్రెస్

ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ఏదో ఒక పదవి అనుభవించిన వారు.. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడిన వారు.. సైలెంట్‌గా కూటమి పార్టీల్లో చేరిపోయారు. అలా వచ్చిన వారే ఇప్పుడు మళ్లీ పదవులు దక్కించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. అలా వచ్చిన వారికే కూటమి ప్రభుత్వం పదవులు ఇస్తోంది. దీనిపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల పాలక మండలి సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లిస్టులో పేర్లు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన దేవకి వెంకటేశ్వర్లు 2014-19 మధ్య కాలంలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరాపు ద్వారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్‌గా జగన్ పంచన చేరిపోయారు. అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్, అన్నా రాంబాబుల వెంట తిరిగారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఓటమికి దేవకి వెంకటేశ్వర్లు ఆర్థికంగా కూడా సాయం చేశారనేది బహిరంగ రహస్యం. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిని కాకా పట్టి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. అధికార పార్టీ ఏ నా పార్టీ అని గొప్పగా చెప్పుకుంటారు దేవకి వెంకటేశ్వర్లు. గతంలో వాసవి సత్రాల రాష్ట్ర చైర్మన్‌గా కూడా పని చేశారు. కానీ జనసేనలో చేరిన నెల రోజులకే ఏకంగా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యుల జాబితాలో దేవకి వెంకటేశ్వర్లు పేరు చేరింది.

Also Read : గర్భంతో ఉన్న మహిళలు మద్యం సేవించవచ్చా..?

ఇక ఇదే జాబితాలో 15వ పేరు డి.వి.సింధు శ్రీ. నంద్యాల నియోజకవర్గానికి చెందిన సింధు శ్రీని బీసీ కోటాలో టీడీపీ తరఫున ఎంపిక చేశారు. సింధు శ్రీని బోర్డు సభ్యురాలుగా అవకాశం కల్పించటంపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. నిజానికి సింధు శ్రీకి ఇప్పటి వరకు టీడీపీ సభ్యత్వం కూడా లేదు. ఆమె కుటుంబం వైసీపీకి అనుకూలంగా పని చేసిందనేది అందరికీ తెలిసిన విషయం. నిజానికి సింధు శ్రీ కి పదవి రావడం వెనుక ఓ వైద్యుడు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సభ్యత్వం నీకే అని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే చాలా మంది కార్యకర్తలకు ఫోన్లు కూడా వెళ్లాయి. వారి వివరాలు కూడా తీసుకున్నారు. మీకు పదవి గ్యారంటీ అని హామీలు కూడా ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆశావాహులను కాదని.. సింధు శ్రీకి కీలక పదవి రావడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పార్టీ కోసమా ఇంతకాలం కష్టపడి పని చేశామని కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరికొందరైతే.. కేసులు మాకు.. పదవులు మాత్రం పైసలున్నోళ్లకా.. అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఇది మంచి ప్రభుత్వం.. అని సెటైర్లు కూడా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్