తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా వచ్చిన ఖాకీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎక్కడో రాజస్థాన్ నుంచి లారీ డ్రైవర్లుగా దక్షిణాదికి వచ్చి తమిళనాడుతో పాటుగా పలు రాష్ట్రాల్లో చోరీలు చేయడమే కాకుండా దారుణాలకు కూడా ఓ గ్యాంగ్ పాల్పడేది. ఎటువంటి ఆధారాలు లేకుండా చోరీలు చేసి సైలెంట్ గా సొంత రాష్ట్రానికి వెళ్లిపోయేవారు. వారిని పట్టుకోవడానికి తమిళనాడు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించి అరెస్టులు చేస్తారు. నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Also Read : తమిళ నాడు స్టాలిన్, వైసీపీ చీఫ్ జగన్ కు బాంబు వార్నింగ్..!
బవారియా గ్యాంగ్ ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు తమిళనాడు పోలీసులు పక్క ఆధారాలతో రంగంలోకి దిగి వాళ్ళని అరెస్టు చేస్తారు. ఇప్పుడు అదే రేంజ్ లో ఏపీ పోలీసులు కూడా అరెస్టులు చేశారు. విశాఖలో గత కొన్నాళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఇదే గ్యాంగ్ సభ్యుడిని ఉత్తరప్రదేశ్ వెళ్లి అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. ఈ విషయాన్ని వైజాగ్ క్రైమ్ డిసిపి లతా మాధురి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గత నెల 17వ తారీఖున విశాఖపట్నంలో బైకులతో పాటుగా చైన్ దొంగతనాలు కూడా ఈ గ్యాంగ్ పాల్పడినట్లు తెలిపారు.
Also Read : మిథున్ రెడ్డికి మద్దతు ఎక్కడ..? సైలెంట్ గా క్యాడర్..!
అక్కడి నుంచి రాజస్థాన్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లి తలదాచుకున్నారని, అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల కదలికలను గమనించారని, మీడియాలో వచ్చిన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడ్డారని లతా మాధురి వెల్లడించారు. కానీ విశాఖ పోలీసులు మాత్రం సినీ పక్కిలో అత్యంత ధైర్యంగా ఉత్తరప్రదేశ్ వెళ్లి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని ఆమె కొనియాడారు. పోలీసులపై నిందితుల గ్రామస్తులు దాడికి కూడా పాల్పడినట్లు ఆమె వెల్లడించారు. ఖాకీ సినిమాలో కూడా ఇదే విధంగా నిందితుడి గ్రామస్తులు పోలీసులు మీద దాడి చేయడం చూపిస్తారు. ఈ గ్యాంగ్ లో మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.