Wednesday, August 5, 2026 12:54 PM
Wednesday, August 5, 2026 12:54 PM

యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ నుంచి ఈఎంఐ పేమెంట్..!

భారత్ లో యూపీఐ సేవలు అత్యంత కీలకంగా మారాయి. ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థలో వీటిది సింహభాగం అనే చెప్పాలి. రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు చేసే ఈ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను పలు దశల్లో బలోపేతం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయంలో మరో కీలక అడుగు పడింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ చెల్లింపులలో మరో కీలక మార్పును తీసుకువచ్చింది. ఈసారి, యూపీఐ ద్వారా ఈఎంఐలు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.

Also Read : భారత్ లో టమాటా వైరస్.. పిల్లలకే ప్రమాదం..?

దీనితో యూపీఐ చెల్లింపుల విధులను విస్తృతం చేయాలని భావిస్తోంది. దీనితో క్రెడిట్ యాక్సెసిబిలిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో యూజర్స్ ఈ విషయంలో పలు డిమాండ్ లు చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈఎంఐ చెల్లింపులను తీసుకురావడం ద్వారా లావాదేవీలు మరింత పెరుగుతాయి. ఇటీవల రూపే క్రెడిట్ కార్డ్‌ ను కూడా ఇందులో యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి పలు ప్రయోగాలకు కూడా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పలు శ్రీకారం చుడుతోంది.

Also Read : దేశానికి గుండెకాయ ఈ రైల్వే స్టేషన్..!

క్రెడిట్ కార్డులను యూపీఐలో యాడ్ చేస్తే భారీ ఆర్ధిక ప్రోత్సాహాలను కూడా బ్యాంక్ లకు ప్రకటిస్తోంది. ఇప్పటికే యూపీఐ ద్వారా పలు సంస్థలు క్రెడిట్ ఆఫర్లు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈఎంఐ చెల్లింపుతో పాటుగా ఇంకా ఎన్ని చెల్లించాలి అనే వివరాలు కూడా తెలుసుకునేలా ఈ ఫీచర్ ను మారుస్తున్నారు. అటు యూపీఐలో కొన్ని చార్జీలను కూడా తగ్గించే యోచనలో ఉన్నారు. క్రెడిట్ కార్డు నుంచి చేసే రెంటల్ పేమెంట్స్ విషయంలో భారీ చార్జీలు వేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని తగ్గించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్