దేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపు కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇటీవల విమానాశ్రయాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు, రద్దీ ఉండే ప్రాంతాల్లో బాంబు బెదిరింపుల మెయిల్స్ రాగా ఇప్పుడు ఏపీ, తమిళ నాడు రాష్ట్రాల ప్రముఖులకు వార్నింగ్ లు వచ్చాయి. తమిళనాడులోని అనేక ప్రముఖ ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి, వాటితో పాటుగా చెన్నైలోని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యాలయం, సీనియర్ హీరోయిన్ త్రిష నివాసాలకు బెదిరింపులు వచ్చాయి.
Also Read : దేశానికి గుండెకాయ ఈ రైల్వే స్టేషన్..!
చెన్నైలోని తేనాంపేట ప్రాంతంలోని త్రిష నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో పోలీసులు స్నిఫర్ డాగ్స్ తో సోదాలు నిర్వహించారు. తమిళనాడు గవర్నర్ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయని సమాచారం. ఇక ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ ఇంట్లో కూడా రెండు బాంబులు ఉన్నాయని వార్నింగ్ వచ్చింది. తిరుమలలో కూడా బాంబులు పెట్టామని, అర్జెంట్ గా భక్తులను ఖాళీ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి, ఏపీ డీజీపీకి బాంబు బెదిరింపు మెయిల్స్ చేసారు.
Also Read : సూత్రధారులను ఎప్పుడు పట్టుకుంటారు..?
ఇటీవల విజయవాడలోని బీసెంట్ రోడ్ కు ఇలాగే బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ తర్వాత అందరిని ఖాళీ చేయించి సోదాలు చేసారు. ఆ తర్వాత తిరుపతికి మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. ఇక తమిళనాడు స్టార్ హీరో విజయ్ నివాసానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో ఆయన ఇంట్లో సోదాలు చేసారు పోలీసులు. చెన్నై విమానాశ్రయానికి కూడా ఇదే స్థాయిలో బాంబు బెదిరింపు కాల్ రావడం సంచలనం అయింది. ఇలా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు బెదిరింపులు రావడం, సోదాలు చేయడం, ఏం లేదని తేలడం సహజంగా మారింది.