దేశాన్ని కనెక్ట్ చేసే విషయంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతీ మారుమూల ప్రాంతానికి వెళ్ళే విధంగా రైల్వే వ్యవస్థను భారత్ నిర్మించుకుంది. అయితే ఈ రైల్వే వ్యవస్థలో కొన్ని స్టేషన్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలను కనెక్ట్ చేయడానికి కలకత్తా, దక్షిణ, ఉత్తర భారతాన్ని కలిపే విజయవాడ, చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లు.. దేశం మొత్తానికి సర్వీసులు నడిపే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎంతో కీలకం. అయితే వీటి అన్నిటికంటే ఓ రైల్వే స్టేషన్ అత్యంత కీలకం. అదే ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్.
ఎన్నో ప్రధాన రైల్వే స్టేషన్ లు ఉన్నప్పటికీ.. ఈ స్టేషన్ దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటి అందిస్తుంది. ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున ఉన్న మధుర జంక్షన్ నుంచి దేశంలో ప్రతీ ప్రాంతానికి రైలు వెళ్తుంది. సందడిగా ఉండే ఈ స్టేషన్ నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ లో భాగంగా, లక్షలాది మంది ప్రయాణికులకు జీవనాధారంగా పనిచేస్తోంది. దాదాపు ప్రతి నగర మార్గాన్ని కవర్ చేస్తూ అన్ని దిశలలో రైళ్లు నడుస్తుండటంతో, మధుర జంక్షన్ భారతదేశంలో రైలు ప్రయాణానికి కేంద్ర బిందువుగా మారింది.
Also Read: భారీగా నిధులు ఇవ్వండి.. నిర్మలకు చంద్రబాబు విజ్ఞప్తి
రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి హై ప్రొఫైల్ రైళ్లతో సహా ఇక్కడ ప్రతిరోజూ సుమారు 197 రైళ్లు ఆగుతాయి. మధుర జంక్షన్ నుండి రైళ్లు తమిళనాడు, కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా రైళ్ళు నడుస్తాయి. మధుర జంక్షన్ లో 10 ప్లాట్ ఫారమ్ లు ఉండగా.. కీలక మౌలిక సదుపాయాలు ఈ స్టేషన్ లో ఏర్పాటు చేసారు. టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ రూములు, ఫుడ్ స్టాల్స్ మరియు రెస్ట్‌రూమ్‌లతో సహా వివిధ సౌకర్యాలు ఉన్నాయి.
శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన మధుర, ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది. కృష్ణ జన్మభూమి ఆలయానికి సమీపంలో ఉండటం వల్ల ఈ స్టేషన్ భక్తులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. ముఖ్యంగా హోలీ మరియు జన్మాష్టమి వంటి పండుగల సమయంలో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 203 హాల్టింగ్ రైళ్ళు ఆగుతూ ఉండగా.. 12 రైళ్ళు ఒక్కసారే బయల్దేరతాయి. 9, 10 మరియు 11 ప్లాట్ ఫామ్‌లను విస్తరించింది రైల్వే శాఖ. కాగా విజయవాడ రైల్వే స్టేషన్ కూడా అదే స్థాయిలో కనెక్టివిటీ అందిస్తోంది.
Also Read: విజయవాడలో దసరా కార్నివాల్
10 ఫ్లాట్ ఫాంలు ఉండగా.. 250 రైళ్ళు ప్రతీ రోజు ఆగుతాయి. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఏకంగా 5 డైరెక్షన్ లకు రైళ్ళు నడుస్తాయి. జంక్షన్ లకు రెండు ఉంటే సరిపోతుంది. కానీ విజయవాడకు 5 ఉంటాయి. బొగ్గు, ఎరువులు, స్టీల్, బియ్యం, పెట్రోలియం ఉత్పత్తులు, సిమెంట్ రవాణాకు విజయవాడ అత్యంత కీలకం. దేశంలో ఇదే అత్యధికం. ఓడిస్సా, పశ్చిమ బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాలను దేశంతో కలిపే ప్రముఖ రైల్వే స్టేషన్ ఇది. ఉత్తరాది రాష్ట్రాలను కేరళ, తమిళ రాష్ట్రాలతో కలపడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ స్టేషన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాయనపాడు స్టేషన్ ను కూడా కొన్ని సర్వీసులకు వాడుతోంది దక్షిణ మధ్య రైల్వే. డిబ్రూఘడ్ నుంచి కన్యాకుమారి వరకు మూడు రోజుల పాటు ప్రయాణించే వివేక్ ఎక్స్ప్రెస్ ఇక్కడి నుంచే వెళ్తుంది.