మన దేశంలో మూడనమ్మకాలు లేదా ఎవరో చేసిన ప్రచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు ఇటువంటి ప్రచారాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు జనాలు. ఇందులో ముఖ్యంగా బొప్పాయి తినే విషయంలో అపోహలు ఎక్కువ. గర్భంతో ఉన్న మహిళలు తింటే ప్రమాదమని చెప్తూ ఉంటారు. అలాగే కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారు అనే అపోహ కూడా ఎక్కువ. మరి ఈ రెండు నమ్మకాలు నిజమేనా..? ఒక్కసారి చూద్దాం.
Also Read : తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది.. అసెంబ్లీ లాబీలో బాలయ్య సందడి
గర్భంతో ఉన్న వాళ్ళు బొప్పాయి తింటే బొప్పాయి గర్భస్రావానికి కారణమవుతుందని నమ్ముతారు. ఈ నమ్మకం మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి, పండని/పాక్షికంగా పండిన పచ్చి బొప్పాయిలో మాత్రమే ఆక్సిటోసిన్, ప్రోస్టాగ్లాండిన్స్ వంటివి ఉంటాయి. వీటిల్లో హార్మోన్లను ప్రభావితం చేసే రబ్బరు పాలు ఉంటాయి. కానీ బొప్పాయి పండినప్పుడు రబ్బరు పాలు కంటెంట్ తగ్గుతుంది. అది తినడం కారణంగా ఏ విధమైన ప్రమాదం ఉండదు. గర్భిణీ బొప్పాయి తింటే పిండానికి ఏ విధమైన హాని ఉండదు.
Also Read : చైనా గుడ్ న్యూస్.. కొత్త వీసా ప్రవేశపెట్టిన బీజింగ్
బొప్పాయి తింటే మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా కనిపించే ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇక కుంకుమ పువ్వు విషయానికి వస్తే శిశువు చర్మం రంగు పూర్తిగా జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. అంతే గాని తినే ఆహారానికి రంగుకు ఏ విధమైన సంబంధం లేదు. కుంకుమ పువ్వును గర్భిని స్త్రీలకు కానుకగా ఇస్తూ ఉంటారు. సీమంతం సమయంలో ఇటువంటివి చూస్తూ ఉంటారు. అలాగే కుంకుమ పువ్వు పాలు కూడా తాగుతూ ఉంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే.