Wednesday, October 22, 2025 01:26 PM
Wednesday, October 22, 2025 01:26 PM
roots

24 గంటల్లో అమెరికా రావాలి.. హెచ్ 1బీ విసా హోల్డర్ లకు ఆదేశం

ముందు నుంచి వలసలకు వ్యతిరేకంగా ఉండే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బీ వీసాల విషయంలో ఒక్కసారిగా ఫీజును భారీగా పెంచేశారు ట్రంప్. వలసలను అరికట్టేందుకు లక్ష డాలర్ల ఫీజు విధించారు. మన కరెన్సీలో రూ. 88 లక్షలకు పైగా విధించారు. దీనిపై ట్రంప్ సంతకం కూడా చేసేసారు. దీనితో ఈ ప్రభావం, భారత్, చైనా నుంచి హెచ్ 1 బీపై అమెరికా వెళ్ళాలి అనుకునే టెక్ నిపుణులపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది.

Also Read : ఫ్యామిలీని టచ్ చేసిన లిక్కర్ స్కామ్ విచారణ..?

అమెరికన్ల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు అనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అమెరికన్ ఉద్యోగులను ఇబ్బంది రాకుండా చూసుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేసారు. దేశంలోని ప్రస్తుత వలస వ్యవస్థలో హెచ్ 1B నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కార్యక్రమం అత్యంత దుర్వినియోగం చేయబడిన వీసా వ్యవస్థలలో ఒకటి అంటూ ట్రంప్ సర్కార్ మండిపడుతోంది. ఇక ట్రంప్ నిర్ణయంతో అమెరికా కంపెనీలు అలెర్ట్ అయ్యాయి. మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన కంపెనీలు శనివారం కీలక ప్రకటన చేసాయి.

Also Read : చెర్రీ కొత్త బిజినెస్ ఏమిటో తెలుసా..?

తమ హెచ్-1బీ వీసాదారులందరూ కనీసం 14 రోజుల పాటు అమెరికా విడిచి వెళ్లవద్దని కోరాయి. అమెరికా వెలుపల నివసిస్తున్న తమ ఉద్యోగులను తిరిగి అమెరికా రావడానికి 24 గంటల సమయం ఇచ్చింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విదేశీ ఉద్యోగులు ఆదేశాలను పాటించాలని కంపెనీలు కోరాయి. వీరిలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, టెక్ ప్రోగ్రామ్ మేనేజర్లు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్ పై ఎక్కువగా పడటం ఖాయమంటున్నారు నిపుణులు. హెచ్ 1 బీ వీసాలలో 71% మంది భారతీయులు ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

శ్రీలేఖకు టీడీపీ క్యాడర్...

రాజకీయాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర కాస్త...

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

పోల్స్