భారత్ పై తమకు ఉన్న కోపాన్ని పదే పదే ప్రదర్శించే ప్రయత్నం చేస్తోన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆసియా కప్ లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో రిఫరీ భారత్ కు అనుకూలంగా వ్యవహరించారు అనే కోపంతో ఉన్న పాకిస్తాన్.. రిఫరీని తొలగించకపోతే మాత్రం ఖచ్చితంగా ఆసియా కప్ లో తదుపరి మ్యాచ్ లను బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయితే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను తొలగించాలనే డిమాండ్ ను ఐసీసీ పూర్తిగా పక్కన పెట్టింది.
Also Read : బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం చేస్తే ఆయుష్షు తగ్గుతుందా? పరిశోధనలో సంచలనం
షేక్ హ్యాండ్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తో పాటుగా, ఆసియా క్రికెట్ అసోసియేషన్ అధికారులకు స్పష్టంగా అవగాహన ఉందని తెలిపింది. అయితే, తమ డిమాండ్ ను ఐసీసీ పక్కన పెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్న పాకిస్తాన్.. యూఏఈతో జరిగిన మ్యాచ్ ను ఆలస్యం చేయడంపై ఐసీసీ సీరియస్ అయింది. టోర్నమెంట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బుధవారం ఈ మ్యాచ్ జరగగా, పాకిస్తాన్ టాస్ కు కూడా ఆలస్యంగా వెళ్ళింది.
Also Read : పెద్దిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్..? మదనపల్లి ఫైల్స్ లో కీలక పరిణామం
ఐసిసి నిబంధనల ప్రకారం, ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పిఎంఓఎ) ప్రోటోకాల్ ను ఉల్లంఘించింది పాకిస్తాన్. దీనికి సంబంధించి ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి ఇ-మెయిల్ చేసింది. మ్యాచ్ రోజున బోర్డు పదేపదే పిఎంఓఎ ఉల్లంఘనలకు పాల్పడిందని ఐసిసి సిఇఒ సంజోగ్ గుప్తా పిసిబికి లేఖ రాశారు. దీనితో పాకిస్తాన్ కు జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ముందు ఐసీసీని బెదిరించిన పాకిస్తాన్, ఆ తర్వాత వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే.