Wednesday, August 5, 2026 03:36 PM
Wednesday, August 5, 2026 03:36 PM

ఆ కలర్ ఐఫోన్ కు ఇండియాలో ఓ రేంజ్ డిమాండ్..!

స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆపిల్ కు ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. లైఫ్ లో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనుకునే టెక్ ప్రియులు ఎందరో.. లేటెస్ట్ గా ఆపిల్ తన ఐఫోన్ 17 సీరీస్ ను విడుదల చేయగా దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫోన్ డిజైన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ లు రిలీజ్ చేసే ఆపిల్ ఈసారి.. ఆరెంజ్ కలర్ లో కూడా ఫోన్ ను రిలీజ్ చేసింది. ఈ కలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఐఫోన్ ఫ్యాన్స్.. ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు.

Also read : కాంతారాకు షాక్.. హైకోర్ట్ నిర్ణయం ఏంటో..?

ఈ టైం లో ఆపిల్ ప్రతినిధులు ఈ కలర్ కు సంబంధించి ఆసక్తికర విషయం బయటపెట్టారు. కాస్మిక్ ఆరెంజ్‌లో ఉన్న కొత్త ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు చాలా డిమాండ్ ఉందని, ప్రీ-ఆర్డర్ చేసిన మూడు రోజుల్లోనే అమెరికా, భారత్ లో అమ్ముడయ్యాయని కంపెనీ సిబ్బంది తెలిపారు. కాస్మిక్ ఆరెంజ్ కలర్, మిగిలిన ఐఫోన్ 17 ప్రో మాక్స్ సిరీస్ ఇంకా భారత్ లోని ఆపిల్ అధికారిక రిటైల్ స్టోర్స్ లో స్టోర్ పికప్ కోసం అందుబాటులోకి రాలేదు. ఆపిల్ ప్రతినిధుల ప్రకారం.. అధిక మొత్తంలో నమోదైన ప్రీ-ఆర్డర్లలో కాస్మిక్ ఆరెంజ్ డామినేషన్ ఉందని తెలిపారు.

Also read : రోడ్డు మీద విగ్రహం.. స్వామి చుట్టూ రాజకీయం..!

ప్రీ-బుకింగ్ చేసుకున్న కస్టమర్లు సెప్టెంబర్ 19 నుండి రూ. 82,900, రూ. 2,29,900 మధ్య ధర కలిగిన ఐఫోన్ 17 సిరీస్‌ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ సీరీస్ అందిస్తున్నారు. వాక్ ఇన్ కు తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఈ నెల 12 న బుక్ చేసుకున్న వారికి వచ్చే నెల 7 నుంచి డెలివరీ ఇవ్వనుంది ఆపిల్. ఆపిల్ స్టోర్ లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొనాలనుకునే వారు అక్టోబర్ మధ్య వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్